Elections 2024: సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీల ఓటమి
ABN, Publish Date - Jun 05 , 2024 | 07:18 AM
అమరావతి: 2024 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గల్లంతైపోయింది. సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీలందరూ ఓటమిపాలయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు డిప్యూటీ సీఎంలు ఓటమిపాలయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వ్యతిరేకత ప్రతిఫలించింది.
అమరావతి: 2024 ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జరిగిన అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ (YCP) గల్లంతైపోయింది. సీఎం జగన్ (CM Jagan), పెద్దిరెడ్డి (Peddireddy) మినహా వైసీపీలోని హేమా హేమీలందరూ ఓటమిపాలయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు డిప్యూటీ సీఎంలు ఓటమిపాలయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వ్యతిరేకత ప్రతిఫలించింది. ఫలితాల ద్వారా అభివృద్ధి, సంక్షేమం రెంటికీ ఏపీ ప్రజలు ఓట్ వేసారు. అప్పులు, అసమర్థ చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోసారి చంద్రబాబు (Chandrababu), మోదీ (Modi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌కు పదేళ్ల తరువాత సంపూర్ణ మద్దతు లభించింది. అమరావతిని (Amaravati) అగం చేయడం, పోలవరం పనులు చేయకుండా సాగదీయడాన్ని తమ ఓటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించారు.
కుమ్మేసిన కూటమి! మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. దెబ్బ అదుర్స్... అనిపించింది. 175 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్ మ్యాప్‌లో ‘ఫ్యాను’ ఆన్ అయిన నియోజకవర్గాలను కాగడా పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం దాకా ఒకటే పరిస్థితి! జిల్లాలకు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ‘సున్నా’తో చతికిలబడింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా మటాష్! నోటి దూల బూతుల నేతలకు దూల తీరింది. జన చేతన ముందు సోషల్ మీడియా మాయలు, ‘బటన్ నొక్కుడు’ మోసాలు పని చేయని స్పష్టమైంది. ‘నువ్వు మంచి చేయలేదు జగన్! నీకు ఓటు వెయ్యలేం’ అని జగన్‌కు ఓటమి రుచి ఘాటుగా చూపించారు. ఇది జన విజయం! ఘన విజయం! నవ్యాంధ్ర భవిష్యత్తుకు ఊపిరిలూదిరిన విజయం! అంతా... దేవుడు రాసిన స్ర్కిప్టు ప్రకారమే!
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 05 , 2024 | 07:18 AM