AP HighCourt: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
ABN, Publish Date - Oct 04 , 2024 | 11:55 AM
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్‌కు షరతులతో కూడా బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్ పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు.
అమరావతి, అక్టోబర్ 4: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు (Bapatla Former MP Nandigam Suresh) హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్‌కు ట్రయల్ కోర్టు అనుమతించింది.
Harish Rao: తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది
కాగా.. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో నందిగం సురేష్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి కేసు నమోదు అయిన నేపథ్యంలో కొన్ని రోజులుగా మాజీ ఎంపీ కోసం వెతికిన పోలీసులు చివరకు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లాకు తరలించారు. అయితే ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. కుదరదని కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాజీ ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేష్‌ను పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కీలక సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టారు. రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్నటి(గురువారం)తో రిమాండ్ ముగియడంతో మరోసారి మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.
Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం
అయితే.. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అప్పట్లో వీరంతా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్ కోసం వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే మొదట ముందస్తు బెయిల్‌కు అంగీకరించేది లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Hyderabad: మాజీమంత్రి కేటీఆర్‌పై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు..
మరోవైపు 2020లో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన రాళ్ల దాడిలో మరియమ్మ అనే మహిళ చనిపోయింది. అయితే అప్పుడు ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. కొద్దిరోజులకే ఈ కేసు మరుగున పడిపోయింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అవడంతో మరియమ్మ కుటుంబీకులు తమకు న్యాయం చేయాలంటూ మరోసారి తుళ్లూరు పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్‌ను ట్రయల్ కోర్టు అనుమతించింది.
ఇవి కూడా చదవండి..
KTR: ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన కేటీఆర్.. కలల సౌధం ఖరీదు 25 వేలు అంటూ విమర్శలు
Durgamma: దుర్గమ్మ దర్శనం.. వీఐపీల కోసం ప్రత్యేక యాప్
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 04 , 2024 | 11:57 AM