Anitha: అబద్దాలు చెప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య
ABN, Publish Date - Aug 24 , 2024 | 03:08 PM
Andhrapradesh: అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. ‘‘జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు’’ అంటూ మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 24: అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి (MLA YS Jaganmohan Reddy) వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యలు చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. ‘‘జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు’’ అంటూ మండిపడ్డారు. ఎల్జి పాలిమర్స్ ఘటం జరిగినప్పుడు బాగా తీవ్రంగా గాయపడిన వారికి 20,000, పాక్షికంగా గాయపడిన వారికి 10000 ఇవ్వమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తుచేశారు.
Congress: సంస్కారం కావాలంటే మేము నేర్పిస్తాం... కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫైర్
ఇప్పుడు పరిహారం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదన్నారు. ఎసెన్షియ ప్రమాద ఘటన లో మృతి చెందిన 17 మంది మృతులకు, 36 మందికి క్షతగాత్రులకు ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు పంపడం జరిగిందన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తెలిసి తెలియకుండా శవాలు మీద పేరాలు ఏరుకున్నట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రమాద బాధితులకు న్యాయం చేశారన్నారు.
AP News: నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత..
ఎల్జి పాలిమర్స్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రూ.150 కోట్లు ఎవరి జేబిల్లోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పాఠశాలలో రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ రెండు బోర్డులు తప్ప ఏమీ ఏర్పాటు చేయలేదన్నారు. రియాక్టర్లు పాడయినప్పుడు కంపెనీ యజమాన్యాలు స్పందించి సరి చేస్తే ప్రమాదాలు జరగవని చెప్పారు. ఒక్కొక్క రియాక్టర్‌కు పది లక్షలు నుంచి కోటి రూపాయలు ఖర్చవుతుందన్నారు. కంపెనీల్లో ప్రమాదాలు సంభవించేటప్పుడు అలారం కూడా మోగని పరిస్థితి ఉందన్నారు. కంపెనీల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్రస్థాయిలో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Subhash: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్
TDP-YSRCP: సవాళ్లు.. ప్రతిసవాళ్లు... తిరువూరులో ఉద్రిక్తత
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 24 , 2024 | 03:11 PM