ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anitha: ఫేసు టు ఫేస్ కూర్చుందాం రండి.. వైసీపీకి అనిత సవాల్

ABN, Publish Date - Oct 09 , 2024 | 02:50 PM

Andhrapradesh: వరద సహాయంపై సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. వరద సాయంపై చర్చకు రావాలంటూ వైసీపీకి హోంమంత్రి సవాల్ విసిరారు. సొంత పత్రికల్లో కాదు ఫేస్ టు ఫేస్ కూర్చుందామని ఛాలెంజ్ చేశారు.

Home Minister Vangalapudi Anitha

అమరావతి, అక్టోబర్ 9: వరద సహాయానికి సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన వార్తలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరద సహాయంపై సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వరద సాయంపై చర్చకు రావాలంటూ వైసీపీకి హోంమంత్రి సవాల్ విసిరారు. సొంత పత్రికల్లో కాదు ఫేస్ టు ఫేస్ కూర్చుందామని ఛాలెంజ్ చేశారు. ‘‘వరద సాయంపై చర్చించడానికి మేం సిద్దం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశాం. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు..?’’ అంటూ ప్రశ్నించారు.

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం


వరద సాయం అందించడమే కాకుండా.. బుడమేరు గండ్లను పూడ్చేలా మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారన్నారు. వరద సమయంలో దాదాపు పదిరోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్‌లో మకాం వేసి రాష్ట్రంలో ఉన్న వరద ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించారని.. అంతేకాకుండా వార్డులకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారని తెలిపారు. ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా అని అడిగారు. ఖాజానా ఖాళీ చేసేసి.. అవినీతి ఖాజానా అంటారా అంటూ మండిపడ్డారు. ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు అంటూ విరుచుకుపడ్డారు. ఎగ్ పఫ్‌లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదని.. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసమే ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. గ్యాస్ స్టవ్వులు కూడా బాగు చేయించిన సీఎం ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు.

Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్


సీఎంగా ఉన్నప్పుడు జగన్ హెలీకాప్టరులో వెళ్లేవారని.. కానీ చంద్రబాబు జేసీబీల్లో పర్యటించారన్నారు. నీట మునిగిన ప్రతి ఇంటిని కడిగించారని తెలిపారు. జగన్‌ది అంతా ఫేక్ బతుకు.. ఎందుకీ బతుకు అంటూ మండిపడ్డారు. 11 సీట్లు వచ్చేసరికి జగనుకు చిప్ పోయినట్టుంది అంటూ విమర్శించారు. పుంగనూరులో ఓ అమ్మాయిని చంపేస్తే.. నలుగురు రేప్ చేసి చంపేశారని వైసీపీ ప్రచారం చేస్తోందని అన్నారు. తాను చేసే అవినీతే అందరూ చేసేస్తారనే భ్రమలో జగన్ ఉన్నారన్నారు. ‘‘మేం పేరు కోసం కాదు.. ప్రజల కోసం పని చేశాం. ప్రజల కోసం పని చేస్తే.. పేరు ఆటోమేటిగ్గా వస్తుంది. అధికారిక చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు.. చర్యలు తీసుకుంటాం. రంగులకు.. సర్వే రాళ్లకు, ఎగ్ పఫ్‌ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లా మా గురించి మాట్లాడేది..? అంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

Anitha: దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 02:54 PM