ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donations: వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:37 PM

Andhrapradesh: ఏపీలో వరదలు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టించాయే అందరికీ తెలిసిందే. బెజవాడ వాసులను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సర్వం కోల్పోయారు వరద బాధితులు. ఇప్పుడిప్పుడే వరద నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు భారీ వరదలతో అంతా కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

Huge donation of electricity workers to flood victims

అమరావతి, సెప్టెంబర్ 10: ఏపీలో (Andhrapradesh) వరదలు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టించాయే అందరికీ తెలిసిందే. బెజవాడ వాసులను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సర్వం కోల్పోయారు వరద బాధితులు. ఇప్పుడిప్పుడే వరద నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు భారీ వరదలతో అంతా కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు కోసం విరాళాలు వెల్లువలా వస్తున్నాయి.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు?


ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద మొత్తం సహాయం అందజేస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా వరద బాధితులకు అందజేశారు. మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో సీఎం చంద్రబాబును (CM Chandrabu naidu) విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 10.60 కోట్లని వరద సాయంగా ఉద్యోగులు ఇచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ... వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారన్నారు. విద్యుత్ పునరుద్దరించడంలో విద్యుత్ ఉద్యోగులు అద్బుతంగా పని చేశారని కొనియాడారు. వరద బాధితులకు సేవలతో పాటు.. వరద సాయం కింద ఒక్క రోజు జీతాన్ని ఇచ్చారన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టానికి ఊడతా భక్తిగా విద్యుత్ ఉద్యోగులూ చేయూతనిచ్చారని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు.

Hyderabad: ప్రతి 13 మందిలో ఒకరికి నడుము నొప్పి


మరోవైపు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు రూ.3 కోట్లు విరాళంగా వచ్చింది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ రూ.2కోట్ల విరాళం అందజేశారు. సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తరపున మరో రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు నుంచి దాదాపు మరో రూ.50 లక్షలు విరాళం కలిపి మొత్తం రూ.3 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కలక్టరేట్లో సీఎం చంద్రబాబును సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు కలిసి ఈ మేర చెక్‌లను అందజేశారు.


ఇవి కూడా చదవండి

Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?

iPhone 16: ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సిద్ధార్థ దంపతులు.. టిమ్‌ కుక్‌తో ముచ్చట్లు

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 10 , 2024 | 01:50 PM

Advertising
Advertising