ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:24 PM

Andhrapradesh: చెత్త పన్ను వసూళ్లల్లో గత ప్రభుత్వంలో గోల్ మాల్‌కు పాల్పడినట్లు బయటపడింది. చాలా మందికి రశీదులు లేకుండానే గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల మేర చెత్త పన్ను వసూళ్ల లెక్కలు తేలడం లేదన్నది అధికారుల మాట.

Huge scam in garbage collection

అమరావతి, అక్టోబర్ 1: ఏపీలో (Andhrapradesh) గత ప్రభుత్వంలో జరిగిన మరో స్కాం తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపైనే దృష్టిసారించారు ప్రభుత్వ పెద్దలు. ఆయా విభాగాల్లో తవ్వే కొద్దీ వైసీపీ నేతలు (YSRCP Leaders) చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని కూటమి నేతలు చెబుతున్నారు. చివరకు చెత్త పన్నులోనూ గత పాలకులు అవినీతికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెత్త పన్ను వసూళ్లలోనూ స్కాంకు పాల్పడిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. చెత్త పన్ను వసూళ్లల్లో గత ప్రభుత్వంలో గోల్ మాల్‌కు పాల్పడినట్లు బయటపడింది.

Sarpanch Elections: సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త


చాలా మందికి రశీదులు లేకుండానే గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల మేర చెత్త పన్ను వసూళ్ల లెక్కలు తేలడం లేదన్నది అధికారుల మాట. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే గత ప్రభుత్వం చెత్త పన్నును వసూలు చేసిందనే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చెత్త సేకరణ సంస్థలకు బిల్లులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. చెత్త సేకరణ సంస్థలకు ఈ ఏడాది జూన్ నాటికి రూ. 33.79 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. 2025 నాటికి మొత్తంగా రూ. 179.29 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేస్తోన్న పరిస్థితి. చెత్త పన్ను వసూళ్ల లెక్కలు లేక.. బిల్లులు పెండింగులో ఉండడంతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. చెత్త పన్ను కుంభకోణంపై మరింత సమాచారాన్ని ప్రభుత్వాధికారులు సేకరిస్తున్నారు.

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ



కాగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్ను నుంచి ప్రజలకు ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. చెత్త సేకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్‌ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. చెత్త పన్నును రద్దూ చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పన్ను వసూళ్లను నిలిపివేయగా ఈ పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో మరొకటి నెరవేరినట్లైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ మునిసిపాల్టీకి జనాభా ప్రతిపాదికన చెత్త సేకరణకు వాహనాలను కేటాయించారు.

Purandeswari: తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడి ఉంటారు


గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్తపన్ను తీవ్ర వివాదాస్పదమైంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచీ ప్రతి నెలా ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రంగంలోకి దించారు. అనుకొన్న స్థాయిలో చెత్త పన్ను వసూళ్లు లేవని భావించి ఆస్తి పన్నులో దీనిని కలిపేసి వసూలు చేయాలని కూడా భావించారు. చెత్త పన్నును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..

Holidays: దసరా సెలవులు ప్రకటించిన సర్కార్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 01:27 PM