ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Department: హోలో గ్రామ్‌ పేరిట భారీ స్కామ్.. వెలుగులోకి వైసీపీ ఆగడాలు

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:12 PM

Andhrapradesh: ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్టు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా చేసేందుకే టెండర్లను పక్కదారి పట్టించినట్టు అనుమానాలు ఉన్నాయి. హోలో గ్రామ్ టెండర్లపై విజిలెన్సు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలో గ్రామ్‌ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం.

Excise Department

అమరావతి, జూలై 30: ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా చేసేందుకే టెండర్లను పక్కదారి పట్టించినట్టు అనుమానాలు ఉన్నాయి. హోలో గ్రామ్ టెండర్లపై విజిలెన్సు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?


హోలో గ్రామ్‌ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లకు వేసే హోలో గ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే హోలో గ్రామ్ కంపెనీలకు బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇష్టానుసారం టెండర్లు కట్టబెట్టారని... జీఎస్టీ లావాదేవీల సమాచారం, గతంలో చేసిన వ్యాపారం వివరాలు లేకుండానే టెండర్లు కట్టబెట్టేసినట్టు విజిలెన్సు బయటపడ్డ వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హోలో గ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతైనట్టు విచారణలో వెల్లడైంది. టెండర్ల ఖరారు ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదికపై అధికారిక సంతకాలు లేనట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా కనిపించకుండా మాయం చేసినట్టు అధికారులు గుర్తించారు.

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?


కాగా.. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. పిచ్చిపిచ్చి బ్రాండ్లు తీసుకువచ్చి పేదల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు చెల్లింపులో ఆన్ లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేసిందన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం చేశారని మండిపడ్డారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు తగ్గిస్తే 2019వైసీపీ హయాంలో వాటి సంఖ్య మళ్లీ పెంచారని ధ్వజమెత్తారు. మద్యం ధరలను సైతం 75శాతం పెంచారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.


శాసనసభ ఏపీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సంక్షేమం, అభివృద్ధి సమతూల్యంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో గత ఐదేళ్లపాటు జరిగిన పరిణామాలు 25సంవత్సారాలపాటు కూడా మనం కోలుకోలేం అన్నట్లుగా ఉన్నాయని సీఎం అన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో, పాలన ఎలా ఉండకూడతో గత ప్రభుత్వం హయాం ఒక కేస్ స్టడీ అవుతుందని ఎద్దేవా చేశారు. అవసరార్థంతో కొందరు తప్పలు చేస్తారు, అత్యాసతో మరికొందరు తప్పలు చేస్తారు, కానీ గత ఐదేళ్లు డబ్బుల ఉన్మాదంతో తప్పలు చేశారని మండిపడ్డారు. అందుకే బాధ, ఆవేదనతో ఇవాళ ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

WhatsApp: భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా? పార్లమెంట్‌లో ఐటీ మంత్రి ఏం చెప్పారంటే..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 30 , 2024 | 04:54 PM

Advertising
Advertising
<