AP Govt: వేదపండితుల భృతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:43 PM
Andhrapradesh: వేద పండితుల నిరుద్యోగ భృతిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు సీఎం.
విజయవాడ, అక్టోబర్ 31: ఏపీ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు సీఎం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలల్లో ప్రధానమైన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సర్కార్ అమలుకు నిర్ణయం తీసుకుంది. బుక్సింగ్ కూడా ప్రారంభమయ్యాయి. రేపు (నవంబర్ 1) లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో హామీని కూడా నెరవేర్చించింది కూటమి సర్కార్.
Ponnam: దేశ ప్రజలకు అమ్మగా ఇందిరాగాంధీ చిరస్మరణీయం
వేద పండితులకు నిరుద్యోగభృతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేద పండితులకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చింది సర్కార్. రాష్ట్రంలో వేద పండితులు పడుతున్న ఇబ్బందులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.3000 చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేదపండితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే భృతితో తమ కష్టాలు కొంతమేర తీరుతాయని వేద పండితులు చెబుతున్నారు.
రేపే ప్రారంభం..
కాగా.. ‘సూపర్-6’ హామీల అమలులో భాగంగా ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ’దీపం-2’ పథకంగా వ్యవహరిస్తున్న ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి తొలి ఏడాది రూ.2,684 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తొలివిడతగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి అయ్యే మొత్తం రూ.894 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న( బుధవారం) పెట్రోలియం సంస్థలకు అందజేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చేతుల మీదుగా హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ల ప్రతినిధులు ఆ చెక్కును అందుకున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహన్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక నుంచి ప్రతి రోజూ లక్షల సంఖ్యలోనే ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్‌లు కొనసాగనున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Vidadala Rajini: యూట్యూబ్ ఛానల్స్‌పై మాజీ మంత్రి ఫిర్యాదు
AP Govt: టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 31 , 2024 | 12:53 PM