ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: ఆ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: బుద్దా వెంకన్న

ABN, Publish Date - Jul 07 , 2024 | 11:08 AM

విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.

విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో (TDR Bonds scandal) జగన్‌ (Jagan)ను అరెస్టు (Arrest) చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలో మరో దోపిడీ జరిగిందని ఆరోపించారు. మురికివాడలో రోడ్లు వేసే పేరుతో రూ. 36 కోట్ల పేరుతో రూ. 700 కోట్లు దోచుకున్నారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవమన్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకరరెడ్డి, కొట్టు సత్యనారాయణ, మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.


ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని, జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయలకు గండి కొట్టి.. వారి సొంత ఖజానాలను నింపుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణాలపై సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నామని, జగన్‌తో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పని చేసిన అధికారులను సీఐడీ విచారించాలన్నారు. జగన్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారని, ఇప్పటి వరకు రెండు వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ చేస్తే... ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుందన్నారు. ఈ వివరాలతో ఎల్లుండి (మంగళవారం) సీఐడీకి పిర్యాదు చేసిన తర్వాత అయినా విచారణ చేయాలని కోరుతున్నామన్నారు.


తిరుపతిలో రూ. 500 కోట్లు, కడపలో రూ. 700 కోట్లు, తాడేపల్లి గూడెం, విశాఖలో కూడా దోపిడీ జరిగిందని, నిజాయతీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టే.. వారి దోపిడీ బయట పడిందని బుద్దా వెంకన్న అన్నారు. ప్రభుత్వం వాల్యూ కట్టాలంటే.. కలెక్టర్లకు పాలకులే ఆదేశాలు ఇవ్వాలని.. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ఇవి దోచిపెట్టారన్నారు. ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ .. తెలుగు ప్రజలకు మేలు చేస్తుందన్నారు. జగన్‌కు ఎన్నికల సమయంలో కేసీఆర్ డబ్బులు పంపించారని, కానీ రాష్ట్రం కోసం ఎప్పుడూ ఇద్దరూ కూర్చుని చర్చలు జరపలేదన్నారు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో, అధికారులతో కమిటీలు వేశారన్నారు. జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేశారని, ఇసుక, మైనింగ్, మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయని బుద్దా వెంకన్న అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?

ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 07 , 2024 | 11:08 AM

Advertising
Advertising
<