ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫలితాలకు ముందు చంద్రబాబుతో పవన్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!

ABN, Publish Date - May 29 , 2024 | 07:25 PM

ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Chandrababu naidu nad Pawan Kalyan

ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీల అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఈనెల 31వ తేదీన వీరిద్దరి భేటీ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబుతో తొలిసారి పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఫలితాలకు ముందు సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ కీలక నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ పార్టీలతో పాటు అనేక సర్వే సంస్థలు ఓటరు ఎలాంటి తీర్పునిచ్చారనేదానిపై సర్వేలు చేశాయి. అన్ని సంస్థల నుంచి అందిన సమాచారం కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Chandrababu: ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే..


చర్చించే అంశాలు ఇవేనా..!

ఎన్నికల ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముందు చంద్రబాబుతో పవన్ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెజార్టీ మార్క్‌కు చేరువ అవుతామనే విశ్వాసం కూటమి పార్టీలో ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఈభేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాల సమాచారం పార్టీ శ్రేణుల నుంచి చేరింది. దీనిపైనా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. కూటమికి మెజార్టీ సీట్లు వస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశాలతో పాటు ఇతర ముఖ్యమైన రాజకీయ అంశాలను ఈ సమావేశంలో ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.


ఏపీలో పెన్షన్ల టెన్షన్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 07:25 PM

Advertising
Advertising