ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: జనసేనకు మరో కీలక పదవి.. ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్..!

ABN, Publish Date - Jun 17 , 2024 | 08:07 AM

ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి వర్గం కొలువుదీరింది. ఈనెల 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు.

Lokam Madhavi and Pantam Nanaji

ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి వర్గం కొలువుదీరింది. ఈనెల 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను సభ ఎన్నుకోనుంది. ఇప్పటికే స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్న జనసేనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి స్పీకర్, జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కూటమి నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేనలో ఈ పదవి ఎవరికి వస్తుందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి మంత్రివర్గంలో ఇద్దరు కాపులు, ఒక ఓసీకి అవకాశం కల్పించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న


పోటీలో ఎవరంటే..

డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించాలని జనసేనాని నిర్ణయిస్తే మాత్రం నెల్లమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే లోకం మాధవి. అదే విధంగా సామాజిక సమీకరణలు ఆమెకు కలిసొచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో జనసేన నుంచి ఇద్దరు కాపు, ఒక ఓసీ ఉన్నారు. లోకం నాగ మాధవి బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమెను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

CM Chandrababu : టీడీపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు


వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యవహరించారు. ఆయన కూడా బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దీంతో ఈసారి కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకం నాగమాధవి కాకుండా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఈ పదవికి ఎంపిక చేయవచ్చనే చర్చ కూడా నడుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలనుకుంటే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ రేసులో ఉంటారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నవారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. దీంతో నాయకర్‌ సేవలను పార్టీ బలోపేతానికి వాడుకునే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకర్‌కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతానికి లోకం మాధవి లేదా పంతం నానాజీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.


Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 17 , 2024 | 08:07 AM

Advertising
Advertising