AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:10 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి, నవంబర్ 6: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కొనసాగుతున్న, పూర్తి అయిన పనులకు సంబంధించి 2014-15 నుంచి 2018-19 సంవత్సరాలకు బిల్లులు చెల్లింపులకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ ముసాయిదా బిల్ 2024 ను ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్ 1982 స్థానంలో తీసుకురావడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 ను సవరణ చేసి రిటైర్మెంట్ వయసును జ్యుడీషియల్ ఆఫీసర్‌లకు 60 నుండి 61 కి మార్పు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ఇది 1.11.24 నుంచి అమలులోకి వచ్చింది.
Supreme Court: ఆ వాహనాలు నడిపేవారికి ప్రత్యేక లైసెన్స్ అక్కర్లేదు: సుప్రీం కీలక తీర్పు
అలాగే ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లుకు 2024 కు కేబినెట్‌లో ఆమోదం లభించింది. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారం లిక్కర్ ఆర్డినెన్స్ 2024లకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్‌గా నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడం ద్వారా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ పేదరిక నిర్మూలనకు తీసుకునే చర్యలకు క్యాబినెట్‌లో ఆమోదం లభించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడ)ని పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.
సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, ఆరు మండలాలు, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి 8352.69 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను నేరుగా కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి పంపేలా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం వల్ల కోర్సు ముగిసిన వెంటనే విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు జారీ అవుతాయని మంత్రిమండలి భావిస్తోంది. 2024 జూన్ 24 నుంచి 2024 అక్టోబర్ 23 వరకు కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చింది.
ఇవి కూడా చదవండి...
Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..
Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 03:34 PM