ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: అందుకే వారిని విధుల నుంచి తొలగించాలి..: లంకా దినకర్

ABN, Publish Date - Apr 14 , 2024 | 11:01 AM

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి జరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారని.. సీఎంకు కనీసం భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి అసమర్థత బట్టబయలు అయ్యిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అంకా దినకర్ అన్నారు.

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పై దాడి జరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారని.. సీఎంకు కనీసం భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ (DGP), ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి (Chief Intelligence Officer) అసమర్థత బట్టబయలు అయ్యిందని ఏపీ బీజేపీ (BJP) ముఖ్య అధికార ప్రతినిధి అంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి సమర్థతపైన అనుమానాలున్నాయి.. కాబట్టే ఏపీ బీజేపీ వారిని విధుల నుండి తొలగించమని ఎన్నికల కమిషన్‌ను కోరిందన్నారు.

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల భద్రతా దృష్ట్యా తక్షణం రాష్ట్రానికి సమర్థులైన డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి నియామకం అవసరమని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్‌పైనే దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో రాజకీయ పండితులు విస్మయం వ్యక్తపరుస్తున్నారన్నారు. బెంగాల్లో మమతా, ఆంధ్రాలో జగన్‌పైన ఎన్నికల సమయంలో దాడులు విషయంలో దేశంలో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్య పడుతున్నారని, పోలీసులు ప్రాధమిక విచారణ అంశాలు బహిర్గత పరచడానికి ముందే అధికారి పార్టీ నాయకులు దురుద్దేశాలు చంద్రబాబు నాయుడుకు ఆపాదించడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2019 లో కోడి కత్తి, బాబాయి హత్య.. ప్రజలను మభ్య పెట్టినట్టే, 2024 లో మరో అంకానికి ప్రయత్నం అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ భారీ ఓటమి దిశగా పయనిస్తోందని తెలిసి అభూతకల్పనలకు బీజం వేస్తుందని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 14 , 2024 | 11:01 AM

Advertising
Advertising