ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anagani: కూటమి ప్రభుత్వం అంటే ఇదీ...

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:41 AM

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కె. విజయానందకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారన్నారు.

Minister Anagani Satyaprasad

అమరావతి, డిసెంబర్ 30: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద (AP CS Vijayanand) నియామకంపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌గా నియమితులైన విజయానందకు మంత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చంద్రబాబు (CM Chandrababu Naidu) నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కె. విజయానందకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీ, ఎస్సీ వర్గాల ప్రతినిధి అని మరోసారి రుజువయిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుందన్నారు. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం అవకాశం కల్పించారన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారి శ్యామల రావు నియమితులయ్యారన్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావుకూడా బీసీనే అని అన్నారు.


తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ ఉన్నారన్నారు. అలాగే శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం కల్పించారని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే జగన్ రెడ్డి నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడంలో సీఎస్‌గా విజయానంద్ విజయవంతంగా పనిచేయగలరని ఆకాంక్షిస్తున్నాన్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.


చంద్రబాబు ధన్యవాదాలు: మంత్రి సవిత

బీసీ బిడ్డ విజయానందను సీఎస్‌గా నియమించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. బీసీలకు ఎల్లప్పుడూ టీడీపీ పెద్దపీట వేస్తోందన్నారు. బలహీనవర్గాల పట్ల నిబద్ధతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారన్నారు. జగన్ పాలనలో ఒక సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెట్టారని విమర్శించారు. నూతన సీఎస్‌గా నియమితులైన విజయానంద్‌‌కు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు.


బీసీల ముద్దుబిడ్డ చంద్రబాబు: బుద్దా వెంకన్న

వైసీపీ హయాంలో సీఎస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒక సామాజిక వర్గమే అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అని విమర్శించారు. బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. డీజీపీ, సీఎస్ కీలక పోస్టులు ఉన్నవాళ్లంతా బీసీలే అని అన్నారు. జగన్ రెడ్డి బీసీలకు కత్తిపీట వేస్తే చంద్రబాబు పెద్దపేట వేశారని చెప్పుకొచ్చారు. బీసీల ముద్దుబిడ్డ చంద్రబాబు అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని అన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా

కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 11:43 AM