ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే..

ABN, Publish Date - Sep 07 , 2024 | 02:56 PM

Andhrapradesh: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Kollu Ravindra

అమరావతి, సెప్టెంబర్ 7: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర (Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు.

Pawan: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి అందించిన డిప్యూటీ సీఎం


ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవి ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజిని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారన్నారు. బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయన్నారు. కుట్రపూరితంగానే జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీకి జరగరాని డామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని... దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు.


గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గండ్లు వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైందని తెలిపారు. గత నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసి గండ్లను పూడ్చామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే బుడమేరుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌


ఏం జరిగిందంటే..

కాగా.. ఐదు రోజుల క్రితం కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈనెల 2న కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలసిందే. వరద ఉధృతికి 4 బోట్లు కొట్టుకొచ్చాయి.


ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు సాగుతున్నాయి. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

Yarlagadda: చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణం

Pawan: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి అందించిన డిప్యూటీ సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 07 , 2024 | 03:12 PM

Advertising
Advertising