ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parthasarathi: ఏపీలో జనాభా సంఖ్య తగ్గిపోతోంది.. పెరుగుదుల అవసరం

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:16 PM

Andhrapradesh: మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Minister Kolusu Parthasaradhi

అమరావతి, ఆగస్టు 7: మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్దసారధి (Minister Kolusu Parthasaradhi) తెలిపారు. కేబినెట్‌ (AP Cabinet) భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

TRAI: సర్వీస్ ఆగితే యూజర్లకు పరిహారం చెల్లించాల్సిందే



ఏపీలో జనాభా సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉందన్నారు. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయన్నారు. ఇద్దరి పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని.. ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరమని చెప్పుకొచ్చారు. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోందని మంత్రి వెల్లడించారు.


అక్టోబర్‌ నుంచి ఎక్సైజ్ కొత్త పాలసీ..

కొత్త వైద్య కళాశాలల్లో అదనంగా 380 పోస్టులకు ఆమోదం తెలిపామన్నారు. సున్నిపెంట పంచాయతీకి ఇచ్చిన 208.74 భూమిని రద్దు చేశామని తెలిపారు. ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారన్నారు. శ్రీశైలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ఎక్సైజ్ శాఖపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించామన్నారు. ఎక్సైజ్ శాఖను ఏకీకృత పర్యవేక్షణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మెరుగైన ఎక్సైజ్ పాలసీన రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్టులోకి తెస్తామన్నారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు చేయనున్నట్లు తెలపారు. మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వ మద్యం విధానాల వల్ల రూ. 18 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు గత ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండేలా విధానాన్ని రూపొందించిందని మంత్రి వర్గం అభిప్రాయపడిందన్నారు.

AP Cabinet: ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


22-ఏ ఫ్రీ హోల్డ్ చేసి గత ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివాదంలో ఉన్న రిజిస్ట్రేషన్ల పునః పరిశీలన చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. మూడు నెలల పాటు అసైన్డ్, 22-ఏ రిజిస్ట్రేషన్లు విచారణ చేపడతామని తెలిపారు. మూడు నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తామని స్పష్టం చేశారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసులు ఇస్తామన్నారు. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Amaravati: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

Jagan: సెక్యూరిటీ పునరుద్దరణపై హైకోర్టులో జగన్ పిటిషన్.. మధ్యాహ్నానికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 04:18 PM

Advertising
Advertising
<