Lokesh: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు.. వైసీపీకి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన లోకేష్
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:50 AM
ఆనాడు తెలుగుదేశం పారట్ీ శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని..ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని మంత్రి స్పష్టం చేశారు.
అమరావతి: గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని (TDP Activists) పోలీసులు (Police) అక్రమ కేసులతో (Illegal Cases) ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా.. బలంగా నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఆనాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని..ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, జగన్ తన అభ్యర్థుల కమిటీల ఓటింగ్‌కు వస్తున్నారా.. అని ఎమ్మెల్యేలతో లోకేష్ అన్నారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఓటింగ్‌కు రావాలా.. వద్దా.. అనే మీమాంసలో ఎందుకు పడాలని నిలదీశారు. నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లుపై ఎమ్మెల్యేలతో లోకేష్ చర్చించారు. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారంటే వారి ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయం మర్చిపోకూడదన్నారు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతనిస్తూ ఎక్కువ ఓట్లతో మనల్ని ప్రజలు గెలిపించారన్నారు. ఎమ్మెల్యేల వినతులపై మంత్రి స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనకు ఇచ్చిన ప్రతీ వినతిపత్రంలో ఎన్ని పరిష్కారమయ్యాయి.. కాకుంటే అందుకుకల కారణాలు వివరిస్తూ లోకేష్ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని మంత్రి అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే దీనిని ప్రస్తుతం అమలు చేస్తున్నామని.. వస్తున్న ఫీడ్ బ్యాక్ తగ్గట్టగా నిర్ణయాన్ని మార్చుకుంటామన్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచుతామన్న మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర: కేటీఆర్
పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక..
అదానీ లంచాల యాత్ర.. ఇరుక్కున్న జగన్
అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 22 , 2024 | 11:50 AM