Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:56 AM
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, ఆగస్టు 27: తణుకు అన్న క్యాంటీన్‌లో (Anna Canteen) ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారన్నారు. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే.. వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. శుభ్రం చేయని ప్లేట్లను వాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారంటూ లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Joe Biden: ప్రధాని మోదీకి ఫోన్ చేసి మెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కారణమిదే..
కాగా.. తణుకు అన్న క్యాంటీన్లో మురికి నీటితో ప్లేట్లను శుభ్రం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మురికి నీటితోనే శుభ్రం చేసి.. అందులోనే భోజనాన్ని వడ్డిస్తున్నారంటూ ఓ వ్యక్తి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. దీంతో వైసీపీ శ్రేణులు ఆ వీడియోను వైరల్ చేయడంతో పాటు ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అయితే వైసీపీ మూకలే ఇలాంటి విష ప్రచారాలు చేస్తోందని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు వేసింది వైసీపీ శ్రేణులే అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తణుకు అన్నక్యాంటీన్ వీడియో గురించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. అన్న క్యాంటీన్‌లో శుభ్రత విషయంపై హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే అన్న క్యాంటీన్‌లో అప్రశుభత్రకు తావు లేదని.. మురికి నీటిలో ప్లేట్లు శుభ్రం చేస్తున్నారన్న వార్త అవాస్తమవి వారు స్పష్టం చేశారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్‌బిన్‌కు బదులుగా చేతులు కడిగే సింగ్ వద్ద ప్లేట్లు పెట్టారని అధికారులు తెలిపారు. ఆ వీడియో అంత అబద్ధమని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు తేల్చిచెప్పారు.
Chandrababu: నీతి ఆయోగ్ ప్రతినిధులతో నేడు చంద్రబాబు సమావేశం
కాగా... పేదవాడికి తక్కువ ధరకే అన్నం పెట్టాలనే ఉద్దేశంలో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను శ్రీకారం చుట్టింది. టీడీపీ హాయంలో సాఫీగా అన్న క్యాంటీన్లు.. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ మూతపడ్డాయి. కొన్నింటిని సచివాలయాలుగాను, కొన్నింటిని ఇతర శాఖల కార్యాలయాలుగా మార్చి వేశారు. తిరిగి మరోసారి భారీ విజయంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. ఈనెలలోనే పండుగ వాతావరణంలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు జరిగాయి. కేవలం 15 రూపాయలకే (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) పేదవాడి ఆకలి తీరుస్తోంది అన్న క్యాంటీన్. అలాగే అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం భారీగా విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Viral Vidoe: పార్కింగ్ విషయంలో లొల్లి.. బ్యాట్‌తో కారును ధ్వంసం చేసి హల్‌చల్
Madanapalli Incident: తెల్లవారేవరకు మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారుల తిష్ట
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 27 , 2024 | 12:01 PM