Nadendla Manohar: ఈరోజు పేద ప్రజలకు పెద్ద పండుగ
ABN, Publish Date - Jul 11 , 2024 | 03:28 PM
Andhrapradesh: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.
విజయవాడ, జూలై 11: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) అన్నారు. నేటి (గురువారం) నుంచి రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నగరంలోని ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్‌లో స్టాల్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 36 వేల కోట్లు మా కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుందని.. రైతులకు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో వెయ్యి కోట్లు రైతులకు ఇచ్చామని తెలిపారు. ఆరు వందల కోట్లు త్వరలో ఇస్తామని వెల్లడించారు.
CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా
ఇటీవల ధరల గురించి సీఎం సమక్షంలో సమీక్ష జరిగిందని.. ధరల స్థిరీకరణపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఈరోజు నుంచి 784 అవుట్ లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. రైతు బజారే కాదు.. అన్ని పెద్ద మాల్స్‌లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగి పిండి, తక్కువకు ఇస్తామని తెలిపారు. బియ్యం కూడా బయటి మార్కెట్ కన్నా తక్కువకే ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘‘రైతుకు, వినియోగదారులకి మేలు జరగాలనేది మా ఆకాంక్ష’’ అని మంత్రి అన్నారు.
KTR: ‘ఈమహా నగరానికి ఏమైంది?’.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాకినాడలోనే 249 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ బియ్యం కుంభకోణం లో ఐదుగురు ఐపీయస్ అధికారులు పాత్ర కూడా ఉందన్నారు. విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అన్యాయం జరగకూడదని.. పీడీయస్ బియ్యం పేదలకే అందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: మళ్లీ నేనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతా...
Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసేజ్‌లు.. వాట్సాప్ బ్లాక్
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 04:15 PM