Share News

Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:32 PM

Andhrapradesh: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.

Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష
Distribution of essential commodities

అమరావతి, సెప్టెంబర్ 5: విజయవాడలో (Vijayawada) వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా బాధితులందిరికీ నిత్యావసరాల పంపిణీ చేసేలా ఏర్పాట్లపై గురువారం మంత్రి నారాయణ (Minister Narayana) సమీక్ష నిర్వహించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..


బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు...ఇవే

  • 25 కేజీల బియ్యం బస్తా

  • కేజీ కందిపప్పు

  • కేజీ పంచదార

  • 2 కేజీల ఉల్లిపాయలు

  • 2 కేజీల బంగాళా దుంపలు

  • లీటరు పామాయిల్‌ను వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు.

Shivraj Singh: ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించిన చౌహాన్


మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది. ముంపు బాధితులకు ఎప్పటికప్పు భోజనం, మంచినీరు, మందులను సరఫరా చేస్తూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని అధికారులకు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 04:40 PM