Ramprasadreddy: అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన
ABN, Publish Date - Jul 16 , 2024 | 02:55 PM
Andhrapradesh: అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అమరావతి, జూలై 16: అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్‌లు (Anna Canteens) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒక్కో నిర్ణయం దశల వారీగా తీసుకుంటామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్ విధానంపై అధ్యయనం చేశామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
AP Cabinet Meet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం
22నుంచే అసెంబ్లీ సమావేశాలు
మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? లేక ఆర్డినెన్స్ పెట్టాలా..? అనే అంశంపై కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శ్వేత పత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి...
Virat Kohli: కోహ్లీతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది గంభీరే: అమిత్ మిశ్రా
AP News: ప్రేమ వేధింపులు.. తండ్రిపై దాడి.. ఆవేదనతో బాలిక బలవన్మరణం
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 16 , 2024 | 02:59 PM