Satyakumar: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:42 PM
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
విజయవాడ, జూలై 6: తెలుగు రాష్ట్రాల (Telugu States) ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ (Minister Satyakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రెండు ప్రాంతాల మధ్య వైశమ్యాలు పెంచుతూ కేసీఆర్ (Former CM KCR) అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ విద్వేషపూరితమైన వాతావరణాన్ని నెలకొల్పారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు.
CMs Meet: సీఎంల మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ..!!
గతంలో ముఖ్యమంత్రుల సహకారం లేక కేంద్రం ఏమీ చెయ్యలేక పోయిందని తెలిపారు. చట్టప్రకారమే అన్ని పంపకాలు జరగాలన్నారు. చట్టాన్ని కాదని డిమాండ్లు పెడితే దానిపై చర్చ జరగాలన్నారు. లక్ష పదివేల కోట్ల అప్పుతో ఏపీ ఉందని.. అన్యాయం జరిగింది ఏపీకే అని చెప్పుకొచ్చారు. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని అన్నారు. డిమాండ్లు పెట్టడంలో తప్పులేదు కానీ అత్యాశపరమైన డిమండ్లు కరెక్ట్ కాదన్నారు. అన్ని సమస్యలను ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు అన్యాయం జరిగిన రాష్ట్రం ఏపీ వైపే కేంద్రం ఉందన్నారు. పోలవరం, రైల్వే జోన్‌కు కేంద్రం సహకారం ఉందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్పొరేటర్లు
Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 06 , 2024 | 04:43 PM