Atchannaidu: మత్స్యశాఖను చూస్తే బాధనిపిస్తోంది...
ABN, Publish Date - Jul 10 , 2024 | 04:36 PM
Andhrapradesh: మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం జాతీయ మత్స్యశాఖ దినోత్సవరం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు.
విజయవాడ, జూలై 10: మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. బుధవారం జాతీయ మత్స్యశాఖ దినోత్సవరం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగరతీరం ఉన్న రాష్ట్రం ఏపీ (Andhrapradesh) అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. నాలుగు హార్భర్లు ఉన్నాయని.. అందులో రెండు పని చేస్తున్నాయి, రెండు పని చేయటం లేదన్నారు. హార్భర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్భర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు.
Chandrababu: ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
వైసీపీ ప్రభుత్వం మొదటి ప్యాకేజిలో 5 హార్భర్లకు కాంట్రాక్టు పిలిచి సొంత వారికి కట్టబెట్టారని ఆరోపించారు. రెండవ పేజ్‌లో 4 హార్భర్లకు టెండర్లు పిలిచారన్నారు. 2014-19 వరకు మత్య్స శాఖ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (CM Chandrababu Naidu) పాలనలో మత్స్యకారులకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఇచ్చే సబ్సిడీని టీడీపీ సానుభూతి పరులకు ఇవ్వకుండా వైసీపీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి అయితే సబ్సిడీ అందలేదో వారి గురించి పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులను కోరానన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మత్స్యకారులు పార్టీకి అండగా ఉన్నారని... వారికి తాము అండగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Breakingnews: ఏపీ మంత్రి మాటల దాడి... బ్లాక్ చేసేసిన కేటీఆర్
KTR: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితిపై కేటీఆర్ ఫైర్..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 10 , 2024 | 04:38 PM