Gadde Rammohan: జగన్ పేదల నోటి వద్ద కూడా తీసేశారు.. ఎమ్మెల్యే ఫైర్
ABN, Publish Date - Aug 16 , 2024 | 11:32 AM
Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.
విజయవాడ, ఆగస్టు 16: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను (Anna Canteen) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (MLA Gadde Rammohan) , కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ‘‘జగన్ అధికారంలోకి రాగానే పేదల నోటి వద్ద కూడు తీసేశారు... ఆరోజు మేమంతా జగన్‌ను అర్ధించాం . పేరు మార్చుకుని అయినా నడపాలని కోరాం. అసెంబ్లీ సాక్షిగా ఆందోళన చేసినా జగన్‌కు పేదలపై కనికరం కలగలేదు. తమిళనాడులో స్టాలిన్ అమ్మ క్యాంటీన్లను యధావిధిగా నడిపారు. జగన్ పైశాచికత్వంతో పేదలకు అన్నం లేకుండా చేశాడు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించారని.. త్వరలోనే మరో రెండు వందల క్యాంటీన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. నెలకు 450 రూపాయలకే ఒక పేదవానికి ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
Anna Canteens: రాష్ట్రవ్యాప్తంగా సందడి అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు
కలెక్టర్ సృజన మాట్లాడుతూ...
జిల్లా వ్యాప్తంగా ఈరోజు 17 అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం మొత్తం 15 రూపాయలకి దొరుకుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల రద్దీని బట్టి మార్పులు చేస్తూ ముందుకు సాగుతామన్నారు. పేదలకు కడుపు నింపేందుకు ఈ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు. త్వరలో మరిన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. రుచిగా శుచిగా పేదలకు ఆహార పదార్థాలు అందిస్తామన్నారు. అన్న క్యాంటీన్లు నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమైన మేరకు కార్మికులను నియమిస్తామని చెప్పారు. ప్రజలు కూడా పరిశుభ్రత పాటించాలని కోరారు. ఒకొక్క అన్న క్యాంటీన్లో సుమారు వెయ్యి మంది టిఫిన్, భోజనం చేసే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
Jay Shah: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాల్సిన అవసరం లేదు.. బీసీసీఐ కార్యదర్శి జై షా ఏమన్నారంటే..
వారిపై కక్షతోన అన్నా క్యాంటీన్ల రద్దు: కేశినేని
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం చిన్ని అక్కడే టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారన్నారు. అన్నా క్యాంటీన్ 60 రోజుల్లోనే ఏర్పాటు చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ రాగానే పేదలపై కక్షతో అన్న క్యాంటీన్లను రద్దు చేసిందన్నారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. రెండో అన్నా క్యాంటీన్లు నందిగామలో ప్రారంభించామని తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్నా క్యాంటీన్లో పేదలకు అందించే భోజన భారాన్ని ప్రభుత్వంపై పడకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు , నాయకులు చూసుకుంటారన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు చేసిన దుర్మార్గులు ఎవరైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎంత దుర్వినియోగం అయిందో, క్రికెట్ అసోసియేషన్ మీటింగ్లో ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ భూములు కబ్జా చేసినట్లు రికార్డుల స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఐడీ అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేస్తే ఆస్తులను తన పేరుతో రాయించుకున్న జోగి రమేష్ పైశాచికత్వం ఇంకోటి లేదని కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Lokesh: 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం..
Anna Canteen: నెల్లూరులో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 16 , 2024 | 12:07 PM