ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganta Srinivas: దురుదృష్టకరంగా విజయసాయిరెడ్డి పరిస్థితి...

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:56 PM

Andhrapradesh: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు.

MLA Ganta Srinivas

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు. విజయసాయిరెడ్డి పరిస్థితి దురదృష్టకరంగా మారిందన్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.

Rammohannaidu: ఎన్నో ఎయిర్‌పోర్టులు ఉన్నా గన్నవరం ఎయిర్పోర్ట్‌పైనే దృష్టి


గత ప్రభుత్వంలో తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేశానని తెలిపారు. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్న విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామిని రప్పించి... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారని తెలిపారు.

Edible Oil: సామాన్యులకు షాకింగ్.. పెరగనున్న వంట నూనెల ధరలు


స్థానిక ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. విజయసాయిరెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే.. వేరేలా చేసుకోవడం మంచిది అంటూ హితవుపలికారు. విజయసాయి రెడ్డికి స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రాజీనామా చేసి ఉంటే బాగుండేదన్నారు. విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: అహంకారమే జగన్‌కు కష్టాలు తెచ్చిపెట్టిందా..

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 14 , 2024 | 01:09 PM

Advertising
Advertising