ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: వైసీపీ నాయకుల మాటలు విని ఉపాధి కోల్పోయిన లక్ష మంది..

ABN, Publish Date - Jun 19 , 2024 | 03:41 PM

ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందనేది పక్కనపెడితే.. లక్షమందికి పైగా యువత ఉపాధి కోల్పోవడానికి మాత్రం ఆ పార్టీ నాయకులు కారణమయ్యారు. వైసీపీ నాయకులు మాటలు నమ్మిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం కోసం తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Volunteers

ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందనేది పక్కనపెడితే.. లక్షమందికి పైగా యువత ఉపాధి కోల్పోవడానికి మాత్రం ఆ పార్టీ నాయకులు కారణమయ్యారు. వైసీపీ నాయకులు మాటలు నమ్మిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం కోసం తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమల్ని వాలంటీర్లుగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏమిటని వాలంటీర్లు ఆలోచించలేదు. నాయకుల మాటలు నమ్మి రాజీనామాలు సమర్పించారు. వాస్తవానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు మరింత చేరువచేసేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించి వారికి నెలకు రూ.5వేల గౌరవ వేతనంగా నిర్ణయించారు.


వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడం.. కేంద్రప్రభుత్వానికి సంబంధించి నెహ్రూయువకేంద్ర సంఘటన అనే ఒక సంస్థ కింద కొంతమంది వాలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారా ఆయా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు వారిని వినియోగిస్తారు. దీనికి గానూ కొంత గౌరవ వేతనం చెల్లిస్తారు. అదే తరహాలో గ్రామ, వార్డు వాలంటీర్ల పేరుతో ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా చేరవేసేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది. వీరికి ప్రభుత్వ ఖజనా నుంచి గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మందిని నియమించారు. ప్రభుత్వ ఖజనా నుంచి వీరికి గౌరవ వేతనం చెల్లిస్తుండటంతో వీరు ఏ ఒక్క రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని.. రాజకీయపార్టీలకు అనుబంధంగా పనిచేయకూడదని న్యాయస్థానాలు, భారత ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ద్వారా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల ఓట్లు తమకే పడతాయన్న ఆశతో భయపెట్టి, బెదిరించి వాలంటీర్లతో వైసీపీ నాయకులు రాజీనామా చేయించారు. దీంతో లక్ష మందికి పైగా తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూడటంతో లక్ష మందికి పైగా యువత తమ ఉపాధిని కోల్పోయినట్లైంది.

Parthasarathy: జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి


భయపెట్టి..

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. దీంతో వాలంటీర్లకు రెండు నెలలకు సరిపడా వేతనం రూ.10వేల చొప్పున ఇస్తూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ మండల స్థాయి నాయకులు వాలంటీర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ రాజీనామా చేయించారు. కొంతమంది రాజీనామా చేసేందుకు విముఖత చూపించినప్పటికీ మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. రాజీనామా చేయకపోతే మిమల్ని తొలగిస్తామంటూ కొందరు నాయకులు బెదిరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. మరికొందరు వాలంటీర్లు మాత్రం వైసీపీ నాయకుల బెదిరింపులకు లొంగకుండా తాము రాజీనామా చేసేదిలేదని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పడంతో కొందరు వాలంటీర్లు రాజీనామా చేసేందుకు ముందుకు రాలేదు. మరికొందరు మాత్రం వైసీపీ నేతల మాటలు నమ్మి రాజీనామాలు సమర్పించారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకుల మాటలు నమ్మడంతో తాము ఉపాధి కోల్పోయామని రాజీనామా చేసిన వాలంటీర్లు లబోదిబోమంటున్నారు. మరికొందరు వాలంటీర్లు తమను బెదిరించిన వైసీపీ నాయకులపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు.

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల


లక్షమంది ఉపాధికి గండి..

వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ద్వారా వైసీపీ నాయకులు లక్షమంది ఉపాధికి గండి కొట్టినట్లైంది. ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే రూ.5వేల గౌరవ వేతనంతో గ్రామీణ ప్రాంతంలో యువత ముఖ్యంగా మహిళలు ఎంతోకొంతమేర తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉపాధి కోల్పోయిన వాలంటీర్లకు వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లక్ష మంది యువతకు నెలకు రూ.10వేల చొప్పున ఏడాదికి రూ.1,20,000 కోల్పోవలసి వస్తుంది. మొత్తంగా ఐదేళ్లపాటు దాదాపు రూ.6లక్షలు తాము కోల్పోవలసి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. వైసీపీ ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.


Pawan Kalyan: పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే.. ఎవరిచ్చారంటే..?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 19 , 2024 | 03:41 PM

Advertising
Advertising