ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YV Subbareddy: కల్తీ జరగలేదు.. న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:51 PM

Andhrapradesh: నా హయాంలో ఏఆర్ కంపనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

YCP MP YV Subbareddy

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: టీటీడీ లడ్డూ (Tirumala Laddu) విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YSRCP MP YV Subbareddy) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. లడ్డూ విషయంలో పొలిటికల్ కామెంట్ చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు.

Viral: 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు.. ఎలా ఉందో మీరే చూడండి!


ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పామన్నారు. తన హయాంలో ఏఆర్ కంపనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారన్నారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుందన్నారు. ‘‘మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు. లడ్డూలను ఇంత వరకు టెస్ట్ చేయలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్


వాస్తవాలు బయటకొస్తాయ్: భూమన

సీబీఐ సిట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం నియమించిన సిట్ ఏవిధంగా న్యాయం చేయదు అనేది తమ భావనన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన నియమించిన సిట్ ఏ విధంగా అయినా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేదని విమర్శించారు. ఈరోజు సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని.. సత్యం వెలుగులోకి వస్తుందన్నారు. తన ఆలయ ప్రతిష్ఠ భంగం కలిగించే వారిపై స్వామివారి చర్యలు ఉంటాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP HighCourt: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌‌కు బెయిల్

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 01:53 PM