ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mandakrishna: ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో చెప్పా...

ABN, Publish Date - Aug 01 , 2024 | 01:21 PM

Andhrapradesh: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.

MRPS Chief Mandakrishna Madiga

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై ఎమ్మార్పీస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (MRPS Chief Mandakrishna Madiga) స్పందించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. నాటి సందర్భంలో సీఎంగా ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు నాయుడు అమలు చేశారని గుర్తుచేశారు.

Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు


సుప్రీంకోర్టు న్యాయం వైపు తీర్పు చెప్పిందని.. ధర్మమే గెలిచిందన్నారు. అధర్మం తాత్కాలికంగా గెలిచినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిపోయామని అన్నారు. ఈ విజయం కోసం 30 ఏళ్లు తపనతో కూడిన పోరాటం చేసామన్నారు. ఈ 30 ఏళ్ల పోరాటంలో అమరులయిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బిడ్డలకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయని.. కొంతమంది వెన్నుపోటు పొడిచారన్నారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడిందన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు తమ వైపు నిలబడ్డారన్నారు.

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..


న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం తమ వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.అణగారిన వర్గాల వైపు, పేద వర్గాలవైపు న్యాయం నిలబడిందన్నారు. ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అండగా నిలబడ్డ ప్రధాని మోడీ, అమిత్ షా, భుజాన వేసుకుని తమవైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలన్నారు. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలని కోరారు. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని... ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని.. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.


ఇవి కూడా చదవండి..

Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...

Chinta mohan: ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 01:23 PM

Advertising
Advertising
<