Share News

Jethwani Case: సీఐడీ విచారణ ప్రారంభం

ABN , Publish Date - Oct 30 , 2024 | 02:03 PM

Andhrapradesh: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈకేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Jethwani Case: సీఐడీ విచారణ ప్రారంభం
Mumbai actress Jethwani case CID investigation begins

అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ (Actress Kadambari Jethwani) కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈరోజు విచారణకు జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న (మంగళవారం) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి రికార్డులు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విద్యాసాగర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో మరోసారి జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

Raghunandan: కాంగ్రెస్ సర్కార్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్


కాగా.. నటి జెత్వానీ కేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇతర నిందితుల్లో డీజీపీ ర్యాంకు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఐజీ ర్యాంకు అధికారి కాంతి రాణా తాతా, డీఐజీ ర్యాంకు అధికారి విశాల్‌ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, మరో న్యాయవాది ఉన్నారు. ఈ క్రమంలో వీరందరినీ విచారించి కేసు నిలబెట్టాలంటే సీఐడీకి అప్పగించడమే సమంజసమని సర్కారు భావించింది. అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీలో ఐజీ వరకు విచారించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కేసులో పోలీసులు ఉన్నతాధికారులు ఉన్నందున సీఐడీకి అప్పగిస్తూ సర్కార్ ఉత్వర్వలు జారీ చేసింది.


మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌ను కస్టడీకీ అప్పగించాలని కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. కుక్కల విద్యాసాగర్‌ను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని నిన్న (మంగళవారం) కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిందితుడి తరపున కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా పడింది.

Viral Video: ఆ మూవీలో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పిన యువకుడు.. ఆ తర్వాత..


ఇదిలా ఉండగా.. నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే కోర్టులో విద్యాసాగర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సెప్టెంబరు 20న విద్యాసాగర్‌ అరెస్టు సమయంలో ఆయన అరెస్ట్‌కు గల కారణాలు వివరించి పోలీసులు చట్టనిబంధనలు అనుసరించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదన్న వాదనతో ఏకీభవించలేమన్నారు. విజయవాడ 4వ అదనపు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ సెప్టెంబరు 23న ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేసేందుకు ఎలాంటి కారణాలు లేవని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

నాకు బిర్యానీ పెట్టండి

‘భారతి’ కొంగు బంగారమే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 02:03 PM