CM Chandrababu: సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. కుటుంబ సభ్యులంతా ఎమోషనల్..
ABN, Publish Date - Jun 12 , 2024 | 11:42 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే.. ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన నాలుగో సారి సీఎంగా ఇవాళ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చంద్రబాబును అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 12 , 2024 | 11:58 AM