ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Devansh: ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్..

ABN, Publish Date - Dec 22 , 2024 | 07:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ (9) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్"తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాన్ష్ స్థానం సంపాదించారు.

Nara Devansh- World Book of Records

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ (9) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్"తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాన్ష్ స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా లండన్ నుంచి వచ్చిన అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్న నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ దేవాన్ష్ "చెక్‌మేట్ మారథాన్" పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డులో బాలుడు క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు.


మరో రెండు రికార్డులు..

తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణి ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శనంతో దేవాన్ష్ ప్రపంచస్థాయి ఈ రికార్డును సాధించగలిగారు. మరోవైపు ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను సైతం సాధించారు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లోనే పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పారు. అలాగే 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చారు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచి రికార్డ్ క్రియేట్ చేశారు. దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దేవాన్ష్ రికార్డులు నెలకొల్పినట్లు ప్రకటించారు. కృషి, పట్టుదలతో కలలు సాకారం చేసుకోవచ్చని దేవాన్ష్ నిరూపించారు. ఇది భారతీయ చిన్నారుల అపారమైన ప్రతిభ, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారనడానికి దేవాన్షే నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ నేపథ్యంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


మంత్రి లోకేశ్ హర్షం..

కుమారుడు దేవాన్ష్ రికార్డ్ నెలకొల్పడంపై మంత్రి లోకేశ్ స్పందించారు. పిన్నవయసులో దేవాన్ష్ సాధించిన ఈ విజయం చూసి గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశా. క్రీడను ఉత్సాహంగా స్వీకరించి ఆడాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. దేవాన్ష్‌కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు చెబుతున్నా. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటలపాటు శిక్షణ పొందాడు. ఎంతో కఠోర శిక్షణ తర్వాత ఈ రికార్డ్‌ నెలకొల్పాడు. ఓ తండ్రిగా చాలా సంతోషంగా ఉంది. అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని" తెలిపారు.


సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

"నా చిన్న గ్రాండ్ మాస్టర్ దేవాన్ష్ ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నా. వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్‌కు అభినందనలు. కృషి, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకం. ఈ విజయం కోసం నెలలు తరబడి దేవాన్ష్ కృషి చేశారని" చెప్పారు.


కోచ్ ఏం చెప్పారంటే..

దేవాన్ష్ కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి సైతం విజయంపై స్పందించారు. దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే డైనమిక్ విద్యార్థని ఆయన చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతని మానసిక చురుకుదనం అపారమని కొనియాడారు. దేవాన్ష్ చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada: అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది: యామిని శర్మ..

Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పిందే వారే: నారా భువనేశ్వరి..

Updated Date - Dec 22 , 2024 | 08:48 PM