Heavy Rains: వరద సహాయక చర్యల్లో నేవీ హెలీకాఫ్టర్లు...
ABN, Publish Date - Sep 02 , 2024 | 03:26 PM
Andhrapradesh: ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో (Andhrapradesh) భారీ వర్షాలతో (Heavy Rains) జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు (Navy helicopters) రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు.
Chandrababu: సీఎం చంద్రబాబు దెబ్బకు అధికారుల పరుగులు
నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతోంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు.
కృష్ణమ్మ మహోగ్రరూపం...
మరోవైపు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బ్యారేజి వద్ద 11 లక్షల 40 వేల 776 క్యుసెక్కులకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తరువాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి.
CM Revanth: వరదల్లో చనిపోయిన వారి కోసం సీఎం రేవంత్ కీలక ప్రకటన
3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. అలాగే వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్ పాల్గొంటోంది. మరికాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 చాపర్స్ రానున్నాయి. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని అటు ప్రభుత్వం.. ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
AP Govt: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు జీతాల టెన్షన్.. అంతలోనే..!!
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 02 , 2024 | 03:26 PM