AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
ABN, Publish Date - Jun 30 , 2024 | 09:39 AM
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి (Distribution of pensions) అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. 4 వేల రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ మూడు వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేయనున్నారు. జీవీఎంసీ పరిధిలో 1 లక్ష 46 వేల 930 మందికి..100.91 కోట్లు పంపిణీ చేయనున్నారు.
జీవీఎంసీ పరిధిలోని 1,46,930 మంది పెన్షన్‌దారులకు సోమవారం రూ.100.91 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కూటమి అధికారంలోకి వస్తే పింఛన్‌ను మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ పెంపుపైనే చంద్రబాబు తొలిసంతకం చేశారు.
జూలై ఒకటో తేదీన రూ.నాలుగు వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఎరియర్స్ రూ.మూడు వేలు కలిపి రూ.ఏడు వేలు అందజేయనున్నారు. ఈ మేరకు వార్డు సచివాలయ పరిధిలో ఎంతమందికి పెన్షన్ అందజేయాలి, ఎంత మొత్తం అవసరమనే దానిపై అధికారులు ముందుగానే లెక్కలు సిద్ధం చేశారు. ఆదివారం బ్యాంకులు సెలవు కావడంతో శనివారమే పెన్షన్ల పంపిణీకి అవసరమైన డబ్బును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయాలని సంబంధిత కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన పెన్షన్‌దారుల ఇళ్లకు ఒకటో తేదీ ఉదయాన్నే వెళ్లి పెన్షన్ అందజేయనున్నారు. జోన్-1 (భీమిలి) పరిధిలో 8,722 మందికి రూ.5,97,89,500, జోన్-2 (మధురవాడ) పరిధిలో 20,378 మందికి రూ.13,99,07,500, జోన్-3 (ఆశీల్‌మెట్ట) పరిధిలో 15,389 మందికి రూ.10,61,27,00, జోన్-4 (సూర్యాబాగ్) పరిధిలో 16,014 మందికి రూ.11,03,99,500, జోన్-5 (జ్ఞానాపురం) పరిధిలో 27,424 మందికి రూ.18,84,77,000, జోన్-6 (గాజువాక) పరిధిలో 32,179 మందికి రూ.22,09,25,500, జోన్-7 (అనకాపల్లి) పరిధిలో 10,057 మందికి రూ.6,84,500, జోన్-8 (పెందుర్తి) పరిధిలో 16,767 మందికి రూ.11,51,68,000 అవసరమని ఆయా జోనల్ కమిషనర్లు నివేదికలు సమర్పించారు. అలాగే విశాఖ జిల్లా పరిధిలోని పెందుర్తి మండలంలో 8,113 మందికి రూ.5,24,79,500, పద్మనాభం మండలంలో 8,821 మందికి రూ.5,97,92,000, ఆనందపురం మండలంలో 6,191 మందికి రూ.4,11,93,000, పెందుర్తి మండలంలో 4,241 మందికి రూ.2,78,96,000 పెన్షన్ కింద పంపిణీ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..
విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 30 , 2024 | 09:39 AM