Vijayawada: కాలనీలకు అందని సాయం.. వరద నీటిలోనే బాధితులు
ABN, Publish Date - Sep 04 , 2024 | 10:27 AM
Andhrapradesh: వరద బీభత్సం నుంచి బెజవాడ వాసులు ఇంకా కోలుకోని స్థితిలో ఉన్నారు. గత నాలుగు రోజులుగా వరద నీటిలోనే వరద బాధితులు జీవనం గడుపుతున్నారు. దాదాపు 15 డివిజన్ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీలను వదలి బయటకు వెళ్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 4: వరద బీభత్సం నుంచి బెజవాడ (Vijayawada) వాసులు ఇంకా కోలుకోని స్థితిలో ఉన్నారు. గత నాలుగు రోజులుగా వరద నీటిలోనే వరద బాధితులు జీవనం గడుపుతున్నారు. దాదాపు 15 డివిజన్ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీలను వదలి బయటకు వెళ్తున్నారు. ఇంకా కాలనీ లోపలకు సహాయం అందని పరిస్థితి.
కేవలం మెయిన్ రోడ్డు వరకే ఉన్నతాధికారులు పరిమితం అవుతున్నారని బాధితులు చెబుతున్నారు. వరద తగ్గు మొహం పట్టినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. అలాగే సందర్శకులను అదుపు చేయడంలోనూ పోలీసులు వైఫల్యం చెందారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తగ్గడంతో లంక గ్రామాలు తేరుకుంటున్నాయి. వరద నీటిలో రోడ్లు కనపబడని పరిస్థితి ఏర్పడగా.. ఇప్పుడు కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో రహదారులు బయటడుతున్నాయి.
Rains: మళ్లీ వర్షం.. బుడమేరుకు వరద పెరిగే అవకాశం.. ఆందోళనలో జనం..
అయితే వరద ప్రవాహంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నారు. అయితే దెబ్బతిన్న రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. మూడు రోజుల నుంచి వరద నీటితో లంక గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. వరద తగ్గడంతో ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సిబ్బంది కాలి నడకన లంక గ్రామాలకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి...
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల బాటలో దేశీయ సూచీలు..
Rain Alert: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 04 , 2024 | 11:09 AM