AP Police: దుర్గమ్మ చెంత విధులకు వచ్చిన పోలీసులు.. ఎంతటి ఘనకార్యం చేశారంటే
ABN, Publish Date - Oct 07 , 2024 | 01:48 PM
Andhrapradesh: డ్యూటీకి వచ్చిన ఆ పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీలు చేస్తున్న పనిని చూసి నెటిజన్లు ఓ ఆటడేసుకుంటున్న పరిస్థితి. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఏంటిది అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ దుర్గగుడి వద్ద డ్యూటీకి వచ్చిన పోలీసులు చేసిన నిర్వాకం ఏంటి...
విజయవాడ, అక్టోబర్ 7: వారంతా దుర్గమ్మ (Vijayawada Durgamma Temple) సన్నిధిలో డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీసులు (AP Police). దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. దేవీనవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడటం వారి డ్యూటీ. కానీ డ్యూటీకి వచ్చిన ఆ పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీలు చేస్తున్న పనిని చూసి నెటిజన్లు ఓ ఆటడేసుకుంటున్న పరిస్థితి. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఏంటిది అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ దుర్గగుడి వద్ద డ్యూటీకి వచ్చిన పోలీసులు చేసిన నిర్వాకం ఏంటి... ఎందుకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారో ఇప్పుడు తెలుసుకుందాం.
Narayana: అమిత్‌షా సమావేశంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనేక మంది పోలీసులు దుర్గమ్మ సన్నిధిలో డ్యూటీ చేస్తున్నారు. అదే విధంగా నలుగురు సీఐలు కూడా దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చారు. తమకు ఇచ్చిన విధులు సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇంతగా వైరల్ అయ్యే స్థితికి వచ్చేది కాదేమో. విధులు నిర్వహించకుండా ఆ నలుగురు సీఐలు పేకాటాడుతూ పట్టుబడ్డారు.
వీరు పేకాటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. పేకాటాడుతున్న పోలీసులను ఎవరో వీడియో తీసి సామాజిక మాద్యమంలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. టూ టౌన్ సీఐ కొండల రావు, పెను కొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు కలిసి ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియోలు చూసిన ప్రతీఒక్కరూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దైవసన్నిధిలో డ్యూటీ వచ్చి ఏంటా పని అంటూ మండిపడుతున్నారు.
Akkineni Nagarjuna: హీరో నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
మరోవైపు ఈ వీడియోలు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలపై అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. దుర్గమ్మ సన్నిధిలో విధులు నిర్వహించకుండా దర్జాగా హోటల్‌లో కూర్చుని తీరిగ్గా పేకాట ఆడుతున్న నలుగురు సీఐలపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయం వైరల్‌గా మారడంతో దుర్గమ్మ భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగల వృత్తిలో ఉండి ఏంటా పని అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి..
ఇవి కూడా చదవండి...
Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో
Duvvada Srinivas: ప్రియురాలితో కలిసి తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 07 , 2024 | 03:42 PM