Dil Raju: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ.. ఎందుకంటే
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:34 PM
Andhrapradesh: మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు.. డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమా ఫంక్షన్‌లో ఏపీలో చేయాలని నిర్ణయించారు. దీంతో జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే గేమ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు.
అమరావతి, డిసెంబర్ 30: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో (AP Deputy CM Pawan Kalyan) ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు (Producer Dil Raju) భేటీ అయ్యారు. సోమవారం ఉదయం మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు.. పవన్‌తో సమావేశయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమా ఫంక్షన్‌లో ఏపీలో చేయాలని నిర్ణయించారు. దీంతో జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే గేమ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. అలాగే సినిమా పరిశ్రమ అభివృద్ధిపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే ప్రీరిలీజ్ వేడుకకు సంబంధించి పవన్ కళ్యాణ్ నిర్ణయం తరువాతనే దిల్ రాజు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ‘‘ముందు మార్పు సినిమా ఇండస్ట్రీ లో రావాలి. ముందు వారు కూర్చొని మాట్లాడాలి. విజయనగరం, అటవీ ప్రాంతం, పాపి కొండలు వంటి స్టన్నింగ్ లోకేషన్‌లు ఉన్నాయి’’ అని పవన్ అనగా.. ఏపీలో లోకేషన్‌లలో సదుపాయాలు కల్పించాలని దిల్ రాజు కోరారు. ‘‘క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. నేను రోడ్డు మీదకు వెళ్తే అన్న మాకు పని ఇప్పించండి అంటున్నారు యువత. యువతలో క్రమశిక్షణ తీసుకురావాలి’’ పవన్ సూచించారు.
అలాగే చిత్రపరిశ్రమ ప్రజలతో మమేకమై ఉంటుందని. విలువలతో కూడిన సినిమాలు, చైతన్యాన్ని ఇచ్చే సినిమాలు అవసరమన్నారు. ఒక కధను అనుకుని ముందుకు తీసుకెళ్లడమే సినిమా అని తెలిపారు. కమర్షియల్ హంగులతో ఉండే సినిమాలతో పాటు, ప్రజలు గురించి సినిమాలు ఉండాలని చెప్పారు. సినిమా పరిశ్రమ ప్రతినిధులు కూడా మంచి సినిమాల కోసం పని తీరు మార్చుకోవాలని అన్నారు. వారి ఆలోచన విధానం మారుతూ ఊభయ కుశలోపరి అనేలా పని చేయాలని సూచనలు చేశారు.
వేల మంది ఆధారపడిన పరిశ్రమ అన్ని విధాలా వృద్ధి చెందాలన్నారు. టీవీ రంగంలో కూడా కొంత మార్పు రావాలన్నారు. జిల్లాల పర్యటన ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. టూరిజం అభివృద్ధి ద్వారా చిత్రాలకు మంచి లొకేషన్లు ఉంటాయన్నారు. టెక్నికల్ ట్రైనింగ్ ద్వారా క్వాలిటీ ఆఫ్ మూవీస్ వస్తాయన్నారు. స్టోరీ, కల్చరల్, నిర్మాణం, కెమెరాలో శిక్షణ ఇచ్చే కేంద్రాలు రావాలన్నారు. బైక్‌ల సైలెన్సర్ తీసి రోడ్లపై విన్యాసాలు చేస్తారని.. అటువంటి యువతకి స్టంట్స్ స్కూల్ పెట్టాలని అప్పుడే వాళ్ల ముచ్చట తీర్చుకోవడానికి వస్తారన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ లిటరీపై అసలు ఎంతమందికి అవగాహన ఉంది’’ అని ఈ సందర్భంగా పవన్ అన్నారు.
Perninani Case: బియ్యం మాయం కేసులో పోలీసుల దూకుడు
నాకు సమయం లేదు..
అనంతరం పవన్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వం లో పరిపాలన అనుభవం కోసం తెలుసుకున్నానని అన్నారు ప్రజల మధ్య ఎప్పుడూ ఉండేవాడినని.. పరిపాలన గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. కొన్ని పుస్తకాలు తనకు చాలా ప్రేరణ కలిగించాయన్నారు. విధానపరమైన నిర్ణయాలు చేసే సమయంలో ఇబ్బందులు కూడా తెలుసుకున్నానన్నారు. పరిష్కారాలు వెతకాలంటే జనంలోనే ఎక్కువుగా ఉండాలన్నారు. ప్రతి సమస్యను అర్ధం చేసుకోవడం వల్ల పరిష్కారం కోసం పని చేస్తున్నానని తెలిపారు. ‘‘నాకు ఈ జీవితం చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. సినిమా, రాజకీయాలు.. ఇప్పుడు నా జీవితం ఇలా మారిపోయింది. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. నాకు ఇప్పుడు అసలు సమయం దొరకడం లేదు. ఒక సమస్య పరిష్కారం చేసే లోపు వంద దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలించి వారి వేదన తీర్చాలని చూస్తున్నా. క్షేత్ర స్థాయిలో పర్యటన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పంచాయతీ ద్వారా అభివృద్ధి ఎక్కువ చేయవచ్చు. పార్టీ, పాలన ఒకేచోట ఉంటే ఎక్కువ సమయం ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది’’ అని పవన్ కళ్యాణ అన్నారు.
గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తోందన్నారు. అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కుడా చెప్పలేకపోతున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. పని చేసే సంస్కృతిని చంపేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తొలి అరు నెలలు, ఈ ప్రభుత్వం ఆరు నెలల పాలన బెరీజు వేసుకోవాలన్నారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలని చెబుతున్నామని.. పరిపాలన తీరు, ప్రజల సమస్యలు పరిష్కారంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టామన్నారు. ఇప్పుడు నేరుగా ప్రజలలోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రతి సమస్య ను పరిష్కరిస్తామన్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో చాలా బాధ్యతతో పని చేస్తున్నామని చెప్పారు. పదవులు అనుభవించడం కాదని... బరువుతో కూడిన బాధ్యతతో పని చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలనేది మోడీ కల అని అన్నారు. ఏపీలో వంద శాతం దీనిని పూర్తి చేయడానికి తాము పని చేస్తున్నామన్నారు. తాగునీటి, పారిశుధ్యం, పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ అంశాల ప్రాధాన్యతగా ముందుకు వెళుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా
కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 30 , 2024 | 12:50 PM