ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RK: దమ్ముంటే చర్చకు రా.. విజయసాయికి ఆర్కే సవాల్..

ABN, Publish Date - Nov 17 , 2024 | 08:22 AM

విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్‌ మెయిల్‌ చేస్తానని, డీల్‌ మేకర్‌ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌, జగన్‌రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.

అమరావతి: రాజకీయాలలో అప్పుడప్పుడూ నీచత్వానికి పరాకాష్ఠ అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో (AP Politics) ప్రస్తుతం అటువంటి నికృష్టుడిని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రూపంలో చూడవచ్చు. కావ్య నాయిక చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు చాటున మరొకరిని దాచిపెట్టేది. అలాగే విజయసాయి రెడ్డి కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి, నాయకుడు జగన్‌రెడ్డి (Jagan reddy)కి విధేయుడినని చెప్పుకుంటూనే... చీకటి మాటున ఇతర పార్టీల నాయకులను కలుసుకుంటుంటారు. ఏబీఎన్‌ చానల్‌లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని, అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు తనను తిడుతూ సుదీర్ఘ ట్వీట్‌ చేశాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ (ABN Andhrajyothy Managing Director ) వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna) అన్నారు. ‘‘ఆ ట్వీట్‌లో నాపై చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలో ఓపెన్‌గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్టు మీడియాకు అధిపతి అవడం ఏమిటి.. అని ఆశ్చర్యపోతున్నాడు మన ఏ2 విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలోనే జవాబిచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు– జగన్‌రెడ్డివలే దొంగ ఆడిటర్‌ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారే సరికి మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ ‘ఆంధ్రజ్యోతి’ని విస్తరించాం.


విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. నేను బ్లాక్‌ మెయిల్‌ చేస్తాను, డీల్‌ మేకర్‌ని అని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌, జగన్‌రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి నాకు.. ఎవరినో బ్లాక్‌ మెయిల్‌ చేసే బదులు ముఖ్యమంత్రులతోనే రాజీపడిపోవచ్చు కదా.. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. అయినా చలించలేదు. నాతో సయోధ్య కుదుర్చుకోవడానికి జగన్‌రెడ్డి కూడా రాయబారాలను పంపిన విషయం విజయసాయిరెడ్డికి తెలియదా.. ‘ఎంత కావాలి?’ అని అడిగితే ‘మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు’ అని నేను చెప్పిన విషయం మరిచావా.. నన్ను డీల్‌ మేకర్‌గా అభివర్ణించారు కదా.. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిశావు కదా.. ఏ డీల్‌ కోసం కలిశావో చెప్పు.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్‌ సంభాషణలను బహిర్గతం చేయడం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి.. ‘తెలుగు రాష్ర్టాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా..’ అని సవాలు కూడా విసిరాడు.


విజయసాయిరెడ్డి వంటి నీచుడు కూడా చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా.. నువ్వూ నేనూ కలసి ఢిల్లీలో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం పెట్టుకుందాం. నీ సంగతీ నా సంగతీ ఏంటో తేల్చుకుందాం. ముందుగా ట్వీట్స్‌ పెట్టడం, ఆ తర్వాత రహస్యంగా కలుసుకొని పైవాళ్ల ఒత్తిడితో చేశాను– నన్ను అపార్థం చేసుకోవద్దని వేడుకోవడం వెన్నెముక లేని ఈ నికృష్టుడికి అలవాటే. ముఖాముఖి చర్చకు సిద్ధం అన్నావు కనుక తాజా ట్వీట్‌లో వాగిన చెత్తకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. మన ఇద్దరి మధ్య సాగే చర్చను ఏబీఎన్‌లో లైవ్‌ టెలీకాస్ట్‌ చేద్దాం. మీ రోత చానల్‌లో కూడా లైవ్‌ టెలికాస్ట్‌ చేసుకోవడానికి అనుమతిస్తాను. కండీషన్స్‌ కూడా ఏమీ లేవు. నువ్వు ఆరోపించినట్టుగా నేను వెధవ పనులు చేసి ఉన్నా, ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొంది ఉన్నా జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టేవారా.. ఎంతగా రంధ్రాన్వేషణ జరిపినా ఏమీ దొరకనందునే కదా నా మీద ఒక్క కేసూ పెట్టలేకపోయారు. ప్రభుత్వాలకు ఎదురు వెళ్లడానికి నైతిక బలం ఉండాలి. అది నాకు పుష్కలంగా ఉంది. నీకు ఆ నైతిక బలం లేనందునే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకుంటావు. నీచ్‌ కమీన్‌ విజయసాయికి తెలియనిది ఏమిటంటే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను నేను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ విషయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియనే తెలియదు. మూతపడిన పత్రిక కార్యాలయాలను తెరిచిన తర్వాత మాత్రమే రాజశేఖరరెడ్డితోపాటు చంద్రబాబును కలసి విషయం చెప్పాను. విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన మినీ హైడల్‌ ప్రాజెక్టు విషయం కూడా చంద్రబాబుకు తెలియదు. ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకొని తిరుగుతున్నాను. ఇప్పటివరకు నువ్వే నా ఇంటికి వచ్చావు కానీ నేను నీ ఇంటికి రాలేదే? ‘జగన్‌రెడ్డి నన్ను నమ్మడం లేదు, దూరం పెట్టాడు’ అని కనిపించిన వారందరి దగ్గరా ఏడ్చే నువ్వో రాజకీయ వ్యభిచారివి. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేర్పిస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తున్నదెవరు? ‘నువ్వు నమ్మదగిన వ్యక్తివి కావు– మోసగాడివి’ అని కేంద్ర హోం మంత్రి నిన్ను ఉద్దేశించి అనడం నిజం కాదా? అయినా ‘ఓపెన్‌ హార్ట్‌’ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు. అన్ని విషయాలూ అక్కడే తేల్చుకుందాం. నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నీవు విసిరిన సవాలుకైనా సిద్ధపడు. లేని పక్షంలో ‘నీచ మానవుడిని’ అని బహిరంగంగా అంగీకరించు... నీచ నికృష్ట విజయసాయిరెడ్డీ! బెస్టాఫ్‌ లక్‌!!


ఈ వార్తలు కూడా చదవండి..

కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు..

అహంకారం.. హాహాకారం!

ఆదివారం నుంచి గ్రూప్ 3 పరీక్షలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 17 , 2024 | 08:22 AM