ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JC: విజయలక్ష్మిను జేసీ కలిసిన కారణమిదే...!

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:43 PM

Andhrapradesh: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంతో జేసీ ముందుకు వచ్చారు.

JC Prabhakar Reddy

హైదరాబాద్ /అమరావతి, జూలై 29: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని (YS Vijayalakshmi) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి (Tadipatri Muncipal Chairman JC Prabhakar Reddy) కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా నడిచాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంపై జేసీ స్పందించారు. అసలు విజయమ్మ కలవడానికి కారణం ఏంటో ఎక్స్ వేదికగా తెలియజేశారు.

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం


ఇదీ విషయం...

ఈరోజు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెళ్లగా.. అక్కడ విజయమ్మ కనిపించారని, వెయిటింగ్ లాంజ్‌లో ఉన్న ఆమెను కలిసి పలకరించానని ఆయన స్పష్టం చేశారు. బాగోగులు అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరిణామం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేడు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి‌కి వెయిటింగ్ లాంజ్‌లో నందు వైఎస్ విజయమ్మ కనిపించడంతో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది. ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Woman Chained In Forest: ఇనుప గొలుసులతో మహిళను అడవిలో చెట్టుకు కట్టేసిన వైనం!


జేసీ సమాధానంతో ఇప్పటి వరకు జరిగిన రకరకాల ఊహాగానాలు తెరపడినట్లైంది. వాస్తవానికి వైఎస్ కుటుంబానికి.. జేసీ ఫ్యామిలీకి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైఎస్ హయాంలో రెండు దశాబ్దాలకుపైగా జేసీ కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే... వైఎస్ జగన్‌ అంటే అస్సలు పడని.. అవకాశం దొరికితే చాలు ఒంటికాలిపై లేస్తుంటారు జేసీ బ్రదర్స్. కూటమి గెలిచిన తర్వాత వైసీపీ హయాంలో తనను అరెస్ట్ చేసిన తీరుతో జగన్‌పై జేసీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నట్లుండి జగన్ తల్లి విజయమ్మను జేసీ కలవడం అనేక ఊహాగానాలకు తావిచ్చినట్లైంది. చివరకు జేసీ సమాధానంతో క్లారిటీ వచ్చేసింది.


ఇవి కూడా చదవండి..

Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్‌ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత

Viveka Case: వివేకా కేసులో ప్రధాన సాక్షి సెక్యూరిటీపై హైకోర్టు ఏం చెప్పిందంటే?


Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 08:42 PM

Advertising
Advertising
<