Gandii Babji: జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:02 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైలు లో పెట్టి ఏడాది పూర్తి అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 10: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YSRCP CHief YS Jaganmohan reddy) అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును (AP CM Chandrababu Naidu) జైలులో పెట్టి ఏడాది పూర్తి అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రాంతాలలో జగన్ పర్యటిస్తూ ప్రజలకు అసత్య ప్రచారాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..
జగన్‌కు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలన్నారు. ఇవే వరదలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు వస్తే ఏరియల్ సర్వే చేసి మ..మ అనిపించేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో రెండు ప్రాంతంలో పర్యటించి ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. ఉత్తరాంద్రలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఆశీస్సులు, సహకారాలు అందించాలని గండి బాబ్జీ కోరారు.
టీడీపీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అయిందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును రాష్ట్ర ప్రజలతో పాటు సుమారు 70 దేశాలలో తెలుగువారు వ్యతిరేకించారన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలను చూసిన ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని గొంప కృష్ణ హితవుపలికారు.
ఇవి కూడా చదవండి
Donations: వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం
Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 10 , 2024 | 03:10 PM