ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivasrao: చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి నోరు అదుపులో పెట్టుకో..

ABN, Publish Date - Sep 18 , 2024 | 10:25 AM

Andhrapradesh: చీటెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత శ్రీనివాసరావు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు.

TDP Leader Kanaparthi Srinivas Rao

గుంటూరు, సెప్టెంబర్ 18: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై(YSRCP Leader Vijayasaireddy) టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (TDP State Working Secretary Kanaparthi Srinivasa Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చీటెడ్ అకౌంటెంట్ అంటూ ఎద్దేవా చేశారు. చీటెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Former CM YS Jagan Reddy) హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు. చంద్రబాబు (CM Chandrababu Naidu) హయాంలో పనిచేసిన అధికారులంతా కేంద్ర కేబినెట్ సెక్రెటరీలుగా, సెంట్రల్ ఐటీ చీఫ్ కమీషనర్లుగా సేవ చేస్తూ ప్రజల్లో గౌరవం పొందుతున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి వైఎస్ కుటుంబానికి.... ఆదిశంకరాచార్యులుకి.. ఆటో శంకర్‌కు ఉన్నంత తేడా ఉందంటూ కనపర్తి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..



కాగా.. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సముద్రమార్గంలో విదేశాలకు జంప్ అయినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి కుటుంబసభ్యులతో సహా విదేశాలకు వెళ్లినట్టు ఏసీబీ గుర్తించింది. కోస్ట్ గార్డ్‌లో పనిచేసిన అనుభవంతో షిప్‌‌లో విదేశాలకు వెళ్లినట్టు ఏసీబీ కనిపెట్టింది. అయితే వెంకట్‌రెడ్డి ఏ దేశానికి వెళ్లారో గుర్తించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తు్న్నారు. రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంకు ముందే విదేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. కూటమి ప్రభుత్వం తమ అక్రమాలను వెలికితిస్తుందనే భయంతో ముందే వెంకటరెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకే వెంకటరెడ్డి విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. అయితే ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర సర్వీస్‌ల నుంచి వచ్చిన వెంకట రెడ్డికి డిప్యూటేషన్ ఆగస్టు ఒకటితో పూర్తి అయిన నేపథ్యంలో.. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉండటంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

CM Chandrababu: కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ


గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో అవన్నీ ఆరోపణలు కాదని.. నిజాలని తేలాయి. దీంతో వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుకు గనుల శాఖ ఉన్నతాధికారులు సిఫార్స్ చేశారు. దీంతో వెంకటరెడ్డి రిలీవ్ కావడానికి ముందే సస్పెండ్ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను వెంకట్‌రెడ్డి తూ. చా తప్పకుండా పాటించే వారనే ప్రచారం నాడు పెద్ద ఎత్తున నడిచింది. అంతేకాకుండా ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సైతం నాడు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి.


ఇవి కూడా చదవండి...

గూగుల్‌ టేకౌట్‌తో గుట్టు రట్టు

Pagers: పేజర్లతో పేలుడు విధ్వంసం.. పేజర్ అంటే ఏంటి, వీటి వాడకం ఎక్కడ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2024 | 10:28 AM

Advertising
Advertising