Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం...
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:34 PM
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపునకు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు.
విజయవాడ, సెప్టెంబర్ 16: ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలివేశారు. బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్‌ను బోటు ఢీ కొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీనితో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు.
TG Politics: తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..
నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్, గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతోంది డైవింగ్ టీమ్. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంద్రాల నుంచి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి.. భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడా చిక్కే ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలడం లేదు. దీంతో నయా ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు అబ్బులు టీమ్.
Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది
కాగా.. వరద కారణంగా కొట్టుకొచ్చిన బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా బోట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోంది. అయిన్పటికీ ప్రయత్నాలను వీడటం లేదు. కొత్తకొత్త ప్లాన్లతో బోట్లను తొలగించేందుకు చూస్తున్నారు. కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అటు కృష్ణా నది.. ఇటు బుడమేరు.. మరోవైపు మున్నేరు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నీటి ప్రవాహ ధాటికి ఒడ్డున నిలిపిన భారీ పడవలు సైతం కొట్టుకొచ్చాయి. ఓ మూడు భారీ సైజు పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ పడవలను తొలగించేందుకు ప్రభుత్వం అబ్బులు టీమ్‌ను ఏర్పాటు చేసింది. అబ్బులు టీమ్ ఈ పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి...
Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Read LatestAP NewsANDTelugu News
Updated Date - Sep 16 , 2024 | 03:48 PM