Union Minister Murugan: ఏపీ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్
ABN, Publish Date - Jul 27 , 2024 | 02:04 PM
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురగన్ అన్నారు. శనివారం నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కేంద్రమంత్రి పూలమాల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మురగన్ మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు.
విజయవాడ, జూలై 27: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురగన్ (Union Minister Murugan) అన్నారు. శనివారం నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కేంద్రమంత్రి పూలమాల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మురగన్ మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించారన్నారు.
AP News: పోలీసుల క్విక్ రియాక్షన్.. 12 గంటల్లోనే హెచ్‌డీఎఫ్‌ఎసీ ఉద్యోగి అరెస్ట్
పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తారని తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కేంద్రం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. అదనపు నిధులు కూడా భవిష్యత్తులో కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం పూర్తికి నిధులు ఇస్తామన్నారు.
Adhra Pradesh: వామ్మో జోగి.. ఓడిపోయినా ఆగని మాజీమంత్రి అక్రమాలు
పూర్ణోదయ పాలసీ ద్వారా ఏపీకి కూడా మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ప్రోత్సహకాన్ని ఇస్తున్నామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే చేసి కిసాన్ క్రెడిట్ అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ నుంచి 60 శాతం మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి, మరింత సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించేలా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చేతి వృత్తుల వారు ఆర్ధికంగా నిలబడేలా రుణాలు అందజేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు వంటి అర్బన్ ఏరియాలు వేగంగా వృద్ధి చెందుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో నిలబడే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ లకు ప్రోత్సాహకాలు ఉంటాయని ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే... పనులు దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని కేంద్రమంత్రి మురగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాతూరి నాగభూషణం, లంకా దినకర్, షేక్ బాజీ, సాధినేని యామిని పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి
Telangana Assembly: హరీష్ vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..!
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 27 , 2024 | 02:07 PM