Share News

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:26 AM

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో ఎ2గా చెప్పిన వేముల దుర్గారావును అరెస్టు చేసిన పోలీసులు విచారించి విడిచిపెట్టారు. నేరం చేసినట్లు ఎటువంటి ఆధారం దొరకక పోవడంతో ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు.

Stone Pelting On Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయితో దాడి కేసు కీలక పరిణామం

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై గులకరాయి దాడి కేసు (Stone Attack Case)లో ఎ2గా చెప్పిన వేముల దుర్గారావు (Vemula Durkarao)ను అరెస్టు చేసిన పోలీసులు విచారించి విడిచిపెట్టారు. నేరం చేసినట్లు ఎటువంటి ఆధారం దొరకక పోవడంతో ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వేముల దుర్గారావు మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం (16వ తేదీ) తనను పోలీసులు తీసుకెళ్లారని, సీఎం జగన్‌పై దాడి ఎందుకు‌ చేయించావని తనను ప్రశ్నించారన్నాడు. తనకు ఏ సంబంధం‌ లేదని చెప్పినా పోలీసులు వినలేదని, సతీష్ (Satish).. నీ పేరు చెప్పాడని, విచారణ చేస్తున్నాం ఒప్పుకోవాలని గట్టిగా మాట్లాడారని చెప్పారన్నాడు. సతీష్ తన పేరు ఎందుకు చెప్పాడో తనకు తెలియదని చెప్పానని దుర్గారావు తెలిపాడు. ‘నువ్వు చేయించావు... నువ్వు టీడీపీ (TDP)’లో ఉంటావుగా అని అడిగారన్నాడు.


jagan.jpg

టీడీపీ నేత (TDP Leader) బోండా ఉమ (Bonda Uma) చేయమని చెప్పారు కదా అని పోలీసులు ‌ ప్రశ్నించారని దుర్గారావు తెలిపాడు. సతీష్ మా పేటలో ఉంటాడు తప్ప... తాను అతనితో తిరగనని చెప్పానన్నాడు. టీడీపీ నాయకులు ప్రమేయం ఉందనే దానిపై చాలా మంది పోలీసు అధికారులు తనను విచారించినట్లు చెప్పాడు. తన ఫోన్ తీసుకుని చెక్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకలేదని, మూడు రోజుల పాటు అనేక కోణాల్లో విచారించారని, తాను ఎటువంటి తప్పు‌చేయలేదని మొదటి నుంచీ చెబుతూనే వచ్చానని, టీడీపీలో యాక్టీవ్‌గా ఉన్నందునే తనను పోలీసులు టార్గెట్ చేశారని చెప్పాడు. మొదట్లో చాలా రాష్‌గా పోలీసులు ప్రవర్తించారని, తాను తప్పు‌ చేయలేదని తెలిశాక మామూలుగానే ప్రశ్నించారని, ఏ ఆధారం దొరకక పోవడంతో 164 నోటీసు ఇచ్చి విడిచిపెట్టారన్నాడు. పోలీసులే తన ఇంటి దగ్గర దింపి.. మా కుటుంబ సభ్యులుతో సంతకాలు‌ చేయించుకుని వెళ్లారని దుర్గారావు తెలిపారు.


న్యాయవాది అబ్దుల్ సలీం (Abdul Saleem) మాట్లాడుతూ.. ఈ కేసులో వేముల దుర్గారావును ఇరికించడానికి పోలీసులు ప్రయత్నం చేశారని, ఎటువంటి ఆధారం లభించక పోవడంతో ఇంటికి‌ పంపారన్నారు. తమ న్యాయ పోరాటం వల్లే దుర్గారావు ఇంటికి చేరాడన్నారు. అతనిపై పోలీసులు నిందారోపణలు మోపి.. ఇబ్బందులు పెట్టారని, కోడికత్తి కేసు తరహాలో ఇందులో కూడా ఇరికించాలని‌ చూశారన్నారు. వారికి న్యాయపరమైన సాయం అందచడానికి తాను సిద్ధమని, రేపు కోర్టులో కూడా నిర్దోషులుగా రుజువు చేస్తానని అబ్దుల్ సలీం అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 07:58 AM