ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: సీఎం జగన్‌కు ఘన స్వాగతం

ABN, Publish Date - Jun 01 , 2024 | 07:25 AM

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) లండన్ (London) పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో (Gannavaram Air Port) సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ పుష్పగుచ్చములిచ్చి ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్ , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని ‌కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు.


కాగా మే 13వ తేదీన అసెంబ్లీకి, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు వెళ్లారు. మే15వ తేదీన వారు లండన్‌కు పయనమయ్యారు. జగన్ లండన్ ప్రయాణానికి నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే నాంపల్లిలోని సీబీఐ కోర్టు నుంచి అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది.


ముఖ్యమంత్రి జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు లండన్‌లో.. మరొకరు అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పక్షం రోజులు జగన్ దంపతులు.. వారి కుమార్తెలతో గడపడానికి వెళ్లారు. అయితే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నారు. మరోవైపు జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఆమె ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

మాకు మీరు.. మీకు మేము!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 01 , 2024 | 12:04 PM

Advertising
Advertising