TDP: గన్నవరంలో దొంగ ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
ABN, Publish Date - Feb 26 , 2024 | 01:52 PM
గన్నవరంలో దొంగ ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నిజమైన నిరుపేద అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తే తానే స్వాగతిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే తరహా దొంగ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల చేరికకు కుట్ర పన్నిందన్నారు.
అమరావతి: గన్నవరంలో దొంగ ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao) తెలిపారు. నిజమైన నిరుపేద అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తే తానే స్వాగతిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే తరహా దొంగ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల చేరికకు కుట్ర పన్నిందన్నారు.
ఇప్పటికే ఎన్నో గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని యార్లగడ్డ తెలిపారు. దొంగ ఓట్లు (Fake Votes) తొలగించకుంటే సంబంధిత అధికారులు ఇందుకు బాధ్యత వహించక తప్పదన్నారు. గన్నవరంలో తెలుగుదేశం (TDP) శ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉంటే, భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు. టీడీపీ అభ్యర్థిగా తనకు తొలి జాబితాలో చోటు కల్పించారన్నారు. తన ప్రత్యర్థి ఎవరో ఇంకా తనకు తెలియదని.. ప్రస్తుతానికి వైఎస్సార్‌సీపీ (YSRCP)నే తన ప్రత్యర్థి అని యార్లగడ్డ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 26 , 2024 | 01:52 PM