ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:33 PM

Andhrapradesh: వైసీపీ హయాంలో ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. అధికారం ఉంది కదా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కాదు. తమ వారికి, తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన పరిస్థితులు అనేకం..

Kadapa Muncipal Office

కడప, ఆగస్టు 12: వైసీపీ హయాంలో ఏపీలో (Andhrapradesh) పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. అధికారం ఉంది కదా వైసీపీ (YSRCP) నేతలు, కార్యకర్తలు చేసిన అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కాదు. తమ వారికి, తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన పరిస్థితులు అనేకం. అయితే అధికారంలో కోల్పోయాక కూడా వైసీపీలోని కొందరు ఇంకా తమ పెత్తనాన్ని చెలాయించాలని చూస్తున్నారు. అందుకు మైదుకూరు మున్సిపల్ కార్యాలయ ఘటనే ఉదాహరణ.

Kandula Durgesh: కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుంది


టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా నేటికి వైసీపీ కాంట్రాక్టర్ చేతికి ఆఫీసు తాళాలను అక్కడి సిబ్బంది ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టపగలే బహిరంగంగా సిబ్బంది కళ్లెదుటే తాళాలు తీసిన వైసీపీ కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి దర్జాగా లోపలికి రికార్డులను మాయం చేసేశాడు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు లేని సమయంలో తనకు కావాల్సిన రికార్డులను వెతికి మరీ తీసుకెళ్లాడు సదరు వైసీపీ కాంట్రాక్టర్. ఆఫీసులో అంతాతానై వ్యవహరిస్తూ వైసీపీ కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఇష్టానుసారంగా బిల్లులు చేయించుకున్నాడని విపక్షాలు మండిపడుతున్నాయి.

MLC Kavitha: సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్..


మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది వద్ద ఉండాల్సిన తాళాలు వైసీపీ నాయకుడు చేతికి ఎలా వచ్చాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ కాంట్రాక్టర్‌ తాళాలు తీసి బుక్కులు తీసుకెళ్తూ ఉంటే ఆ కార్యాలయం అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ కాంట్రాక్టర్ గతంలో అనేక దొంగబిల్లులను చేసుకోవడంతో వాటిని కార్యాలయంలో కనపడకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే రికార్డులను తీసుకెళ్లినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Visakha: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. రేపే తుది గడువు..

Pawan Kalyan: బంగ్లాదేశ్ పరిస్థితులపై పవన్ ట్వీట్... ఏమన్నారంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 02:59 PM

Advertising
Advertising
<