ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sharmila: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల

ABN, Publish Date - Jun 05 , 2024 | 12:33 PM

విజయవాడ: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Janasena Chief) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) షర్మిల (Sharmila) శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆమె బుధవారం విజయవాడ (Viyayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం (New Govt.) రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆమె ఆకాంక్షించారు.


అలాగే ఏపీకి రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని, ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు అడుగు వేయాలని షర్మిల అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడాలని, అన్ని విభజన హామీలకు కేంద్రం కట్టుబడాలని.. అలా అయితేనే కేంద్రానికి మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీదట కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని షర్మిల స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు నివాసంలో సంబరాలు

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 05 , 2024 | 12:35 PM

Advertising
Advertising