ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: నెలరోజుల్లోనే వివాదాలు.. వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత..

ABN, Publish Date - Jul 25 , 2024 | 08:39 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.

YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ (YSRCP) పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు. ప్రజలు వైసీపీపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అప్పుడు అర్థమైంది. టీడీపీ (TDP) కూటమికి ఘన విజయం అందిచడంతో వైసీపీ నేతలు నిరాశ చెందారు. 2019లో వైసీపీ 151 ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ఆ ప్రభుత్వాన్ని వెంటనే విమర్శించమని.. కొంత సమయం ఇస్తామని అప్పటి ప్రతిపక్షం టీడీపీ చెప్పింది. రెండేళ్ల వరకు ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుుడ మాత్రమే తమ నిరసనలు తెలిపింది. రెండేళ్ల తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని, వివిధ రకాల పన్నుల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీని విమర్శించడం మొదలుపెట్టారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ.. ప్రభుత్వానికి నిర్ణయాత్మక సూచనలు అందించాల్సిన వైసీపీ నెలరోజుల్లోనే లేనిపోని వివాదాల జోలికి పోయి ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ తీరుపై ప్రజలు సైతం వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.

Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం


పెరుగుతున్న వ్యతిరేకత..

వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈక్రమంలో రానున్న ఐదేళ్లలో ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం వైసీపీ చేయాల్సి ఉంటుంది. కానీ విపక్షంలో ఉంటూ తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి కాలరాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లూ సంక్షేమ పథకాల పేరుతో కాలయాపన చేసిన జగన్.. ఏపీ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రస్తుత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన వైసీపీ ఆ పని చేయకపోగా.. అసత్య ఆరోపణలతో లేనిపోని వివాదలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందనే చర్చ సైతం జరుగుతోంది.

ఢిల్లీ వీధుల్లో జగన్‌ ధర్నా


తీరు మార్చుకుంటారా..

ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినప్పటికీ.. అధికార పార్టీలోని కూటమి పక్షాలు మినహిస్తే కేవలం వైసీపీకి మాత్రమే శాసనసభలో ప్రాతినధ్యం ఉంది. ఈక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిపై పోరాడటం ద్వారా వైసీపీ ప్రజల పక్షం వహించాల్సి ఉంటుందని ఎంతోమంది రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని.. కేవలం ప్రభుత్వంతో వివాదాలను పెంచుకునే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.


పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra pradesh News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 08:39 AM

Advertising
Advertising
<