ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool : అనంత, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:14 AM

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీవర్షం కురిసింది. బెళుగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • పొంగిపొర్లిన వాగులు, వంకలు

  • వందలాది ఎకరాల్లో పంట నష్టం

కర్నూలు(ఆంధ్రజ్యోతి), కర్నూలు అగ్రికల్చర్‌, అనంతపురం అర్బన్‌, ఆగస్టు 20: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీవర్షం కురిసింది. బెళుగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 196 హెక్టార్లలోని రూ.1.73 కోట్ల విలువైన పంటనష్టం జరిగింది.

కర్నూలు జిల్లాలోని పత్తికొండ డివిజన్‌లో కురిసిన వర్షానికి హంద్రీనది పరివాహక ప్రాంతంలోని వందల ఎకరాల పంట కొట్టుకుపోయింది. హంద్రీ వంక ప్రవాహానికి చినహుల్తి వద్ద ఆదోని-పత్తికొండ ప్రధాన రహదారిలో సుమారు ఆరు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కౌతాళం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.

దేవనకొండ మండలంలో హంద్రీనది ఉధృతికి దాదాపు 1200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా. వేదవతి నది ఉగ్రరూపం దాల్చడంతో హాలహర్వి మండలంలో కట్రవాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించిపోయాయి.


హంద్రీనదికి వర ద రావడంతో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో 25 మంది రైతులు, కూలీలు చిక్కుకుపోయారు. హంద్రీనది సమీపంలోని గంజహళ్లిలో 25 మంది రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లారు. 11గంటల సమయంలో హంద్రీలో నీటి ఉధృతి పెరిగింది. రైతులు చెట్లపైకి, గట్టుపైకి చేరుకుని రక్షించమంటూ కేకలు వేశారు. గాజులదిన్నె నుంచి నీటితెప్పను, గజ ఈతగాళ్లను రప్పించి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

వాతావరణ అనిశ్చితి

విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రం గా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా కావలి, కడపలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24గంటల్లో కోస్తా, రాయల సీమల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత, ఉక్కుపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Aug 21 , 2024 | 05:14 AM

Advertising
Advertising
<