ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Bharath: సమస్యలు తీరిస్తే భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది: మంత్రి టీజీ భరత్

ABN, Publish Date - Jun 15 , 2024 | 01:13 PM

కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు(Heavy Industries) వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్(Minister TG Bharath) అన్నారు. 2014నుంచి 2019వరకు, 2019నుంచి 2024వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న వారు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మెుదటి కర్తవ్యం అని తెలిపారు.

కర్నూలు: కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు(Heavy Industries) వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్(Minister TG Bharath) అన్నారు. 2014నుంచి 2019వరకు, 2019నుంచి 2024వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న వారు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మెుదటి కర్తవ్యం అని తెలిపారు.


మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.."రాష్ట్రాలు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం సహజం, కానీ సబ్సీడీలు ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఇస్తున్నారనేదే ముఖ్యం. పారిశ్రామికవేత్తగా నాకు అనుభవం ఉంది. సబ్సీడీలపై వారికి నమ్మకం కలిగించాలి. ఆ పని టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. సబ్సీడీలు ఇవ్వడం వల్లనే అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వెళ్లిపోయింది. పరిశ్రమలకు అవసరమయ్యే ముడి సరకు ఏఏ ప్రాంతాల్లో ఉందో గుర్తిస్తాం. రా మెటీరియల్ సరఫరా, రోడ్లు, నీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తే ఇండస్ట్రీయల్ జోన్ క్రియేట్ అయ్యి డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు జయరాత్ ఇస్పాత్‌ను తీసుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో రాయితీల విషయంలో కంపెనీ అనేక సమస్యలు ఎదుర్కొంది. గుజరాత్ మాదిరిగా ఏపీలో కంపెనీలు పెట్టేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ఇక జిల్లా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధిలో వారికి సహాయం చేస్తాను" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - Jun 15 , 2024 | 01:13 PM

Advertising
Advertising